Good Health: రెగ్యులర్‎గా బాదం తింటున్నారా.. ఎక్కువ తక్కువ కాకుండా ఇలా తింటూ ఉంటే బీపీ కంట్రోల్‎లో ఉంటుంది..!

Good Health: రెగ్యులర్‎గా బాదం తింటున్నారా.. ఎక్కువ తక్కువ కాకుండా ఇలా తింటూ ఉంటే బీపీ కంట్రోల్‎లో ఉంటుంది..!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒత్తిడి పెద్ద సమస్యగా మారింది. ఉద్యోగులకు ఆఫీసుల్లో వర్క్ ప్రెజర్.. విద్యార్థులకు ర్యాంకులు, పాస్ కావాలని టెన్షన్.. ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన ఒత్తిడి కామన్ అయిపోయింది. పొద్దున లేచిన దగ్గరి నుంచి మొదలయ్యే ఉరుకులు.. పరుగుల జీవితం.. ఏదో ఒక పని.. టెన్షన్​.. ఒత్తిడి.. ఇలా బతకలేక బతుకుతున్నాం. ఈ ఒత్తిడి మరీ ఎక్కువ అయితే అనేక ఆరోగ్య సమస్యలు ఎటాక్ చేస్తాయి.

ప్రజెంట్ జనరేషన్లో ఒత్తిడి కారణంగా చిన్న వయస్సుల్లోనే బీపీ, షుగర్ వ్యాధులు వస్తున్నాయి. ఒత్తిడి కారణంగా అనేక మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మారుతోన్న జీవిన విధానానికి సవాల్‎గా మారిన స్ట్రెస్‎ను తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్‎లో భాగంగా చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడొచ్చంటున్నారు హెల్త్ ఎక్స్‎పర్ట్స్. స్ట్రెస్‎ను కంట్రోల్ చేయడంలో బాదం ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.

Also read:-నవ్వితే.. మూడ్ మారుతుంది.. కష్టాలకు .. బాధలకు చెక్

ఇటీవల జరిగిన ఓ సైంటిఫిక్ సర్వేలో కూడా ఈ విషయం స్పష్టమైంది. సర్వే అధ్యాయనం ప్రకారం.. క్రమం తప్పకుండా బాదం తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని తేలింది. అలాగే శరీరంలోని వాపులు తగ్గి యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్‌లు పెరుగుతాయని రిసెర్చ్‎లో వెల్లడైంది. బాదం తీసుకోవడం వల్ల యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ కార్యకలాపాలు మెరుగుపడతాయని, అలాగే సూపర్ ఆక్సైడ్ డిస్ముటేస్ మెరుగుపడుతుందని తేలింది. మరీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన బాదం రోజుకు ఎంత తినాలో తెలుసుకుందాం.

రోజుకు ఎంత బాదం తినాలి..? 

సర్వే అధ్యయనం ప్రకారం.. రోజుకు 60 గ్రాముల బాదం అంటే రెండు పిడికెడు లేదా 45–50 గింజలు తినాలి. ప్రతిరోజూ 60 గ్రాముల కంటే ఎక్కువ బాదం తినే వారిలో మాలోండియాల్డిహైడ్, 8-హైడ్రాక్సీ-2'-డియోక్సిగ్వానోసిన్ (8-OHdG) వంటి సెల్యులార్ నష్టం గణనీయమైన తగ్గుతుందని సర్వేలో తేలింది. రోజుకు 60 గ్రాములు అంటే చాలా ఎక్కువ అనిపించవచ్చు. కానీ ఇంత మొత్తంలో తింటేనే ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షణ ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇదే సమయంలో బాదం అధికంగా కేలరీలు ఉండే ఆహారమని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. బాదం మితంగా తీసుకోవాలని.. ఇతర ఆహారాలలో ఇప్పటికే తీసుకుంటున్న కేలరీలతో పాటు కాకుండా సమతుల్య ఆహారంలో భాగంగా బాదం తినాలని చెబుతున్నారు. 

బాదం వల్ల లాభాలు:

బాదములలో ప్రోటీన్‌ అధికంగా ఉండటంతో పాటుగా డైటరీ ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. బాదంలో విటమిన్ E, పాలీఫెనాల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ వాటి యాంటీఆక్సిడెంట్ ప్రభావాలకు దోహదం చేస్తాయి. బాదం ఆరోగ్యవంతమైన బ్లడ్‌ షుగర్‌ స్థాయి నిర్వహించడంలో  సహాయపడటంతో పాటుగా టైప్‌ 2 మధుమేహంతో బాధపడుతున్న ప్రజలలో బ్లడ్‌ షుగర్‌ నియంత్రణకూ తోడ్పడుతుంది. అదే సమయంలో సాధారణంగా ఫాస్టింగ్‌ ఇన్సులిన్‌ స్థాయిపై ప్రభావం చూపే కార్బోహైడ్రేట్‌ ఫుడ్స్‌పై బ్లడ్‌ షుగర్‌ ప్రభావాన్ని సైతం తగ్గిస్తాయి.