మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కల్పించాలి ..రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

 మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కల్పించాలి ..రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్​, వెలుగు: మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్​ కోటా కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి శ్రావణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. దేశవ్యాప్త కులగణన చేపట్టడమే అందుకు నిదర్శనమన్నారు. బీసీ మహిళ సబ్ కోటా విషయంపై ప్రధానితో మాట్లాడుతానన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు సుధాకర్, కరుణ, గోరిగే మల్లేశ్, నందగోపాల్, కవిత, అంజి, సాజిదా తదితరులు పాల్గొన్నారు.