MS Dhoni: ధోనీని మ్యాచ్ నుంచి పక్కన పెడుతున్నామని చెప్పే దమ్ముందా?

MS Dhoni: ధోనీని మ్యాచ్ నుంచి పక్కన పెడుతున్నామని చెప్పే దమ్ముందా?

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఎడిషన్ ప్రారంభానికి మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. ఈ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఏ పాత్ర పోషిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎస్కే తన తొలి మ్యాచ్ లో మార్చి 30వ తేదీన రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఇప్పటికే చెన్నై టీమ్ యువ క్రికెటర్లు ప్రాక్టీస్ ని కూడా స్టార్ట్ చేశారు. ధోని కూడా నెట్స్ లో శ్రమిస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సీఎస్కే మాజీ ప్లేయర్ సుబ్రమణియన్ బద్రినాథ్ మాట్లాడుతూ.. ధోని పాత్ర గురించి మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా ఉందన్నారు. 

ఎంఎస్ ధోని అన్ని మ్యాచులను ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ చెప్పడం అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయమో కాదో తెలియదని మాజీ క్రికెటర్ బద్రినాథ్ పేర్కొన్నారు. క్రికెట్ పరంగా ఏం నిర్ణయం తీసుకున్నా సపోర్టు చేస్తామన్నారు. ధోని దగ్గరకు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెళ్లి .. నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్ గా లేదా ఈ మ్యాచ్ లో నిన్ను పక్కన తప్పిస్తున్నాం అని చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నించాడు. అది సాధ్యం కూడా కాదు.. ఫ్లెమింగ్ మాత్రమే కాదు సీఎస్కేలో ఎవరూ అలా చెప్పడానికి సహసం చేయలేరు.. అక్కడ ఉన్నది ధోని ఈ సీజన్లోని అన్ని మ్యాచులనూ ఆడతాడని తెలిపారు. ధోని కూడా మంచి ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఐపీఎల్లో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నాడు. ఎలాంటి పాత్ర పోషిస్తాడనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోందని బద్రినాథ్ వెల్లడించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్లలో ఒకే ఒక్కసారి కప్ ని కైవసం చేసుకుంది. సీఎస్కే మాత్రం 5 టైటిళ్లను దక్కించుకుంది. కాబట్టి, ఇరు జట్ల మధ్య 'పోటీ' ఉంటుందని నేను అనుకోవడం లేదని బద్రీనాథ్ చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన మ్యాచుల్లో మాత్రం సీఎస్కేపై ఆర్సీబీ గెలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై కింగ్స్ ఓడిపోయింది. సీఎస్కే తన సామర్థ్యం మేరకు అత్యుత్తమ క్రికెట్ ఆడటం లేదని పేర్కొన్నారు. అందుకే, ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ కోసం వేచి చూస్తున్నా” అని బద్రినాథ్ తెలిపాడు.