తక్కువ కరెంట్తో నడిచే ఏసీలు, మోటార్లు, ఫ్యాన్లకు సబ్సిడీ

తక్కువ కరెంట్తో నడిచే ఏసీలు, మోటార్లు, ఫ్యాన్లకు సబ్సిడీ
  • LED బల్బుల మాదిరిగా త్వరలో కొత్త స్కీం 
  • ఈఈఎస్ఎల్తో సదరన్ డిస్కం ఒప్పందం

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎ ల్) సంస్థ త్వరలో తక్కువ కరెంట్ తో నడిచే ఏసీలు, మోటార్ పంపుసెట్లు, సీలింగ్ ఫ్యాన్ లను కూడా సబ్సిడీ ధరలకు అందించనుంది. కరెంట్ వాడకాన్ని తగ్గించడం కోసం గతంలో ఎల్ ఈడీ బల్బులను సబ్సి డీపై అందించిన ఈఈఎస్ఎల్ తో ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎ ల్) బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో ఈఈఎస్ఎల్ సబ్సిడీ ధరలకు అందించిన ఎల్ ఈడీ బల్బుల ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరెంట్ కొంతమేరకు ఆదా అయింది. వినియోగ దారులకు సైతం ఖర్చు తగ్గింది. తాజా ఒప్పందం అమలులోకి వస్తే ఈఈఎస్ఎల్ ఏసీలు, మోటార్లు, ఫ్యాన్లతో కరెంట్ వాడకం మరింత తగ్గనుంది. దీని వల్ల పీక్ డిమాండ్ తగ్గడంతోపాటు డిస్కంపై ఆర్థిక భారం కూడా ఉండదు. మొదట కొన్ని ప్రాంతాల్లో, ఆ తర్వాత డిస్కం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఈ స్కీంను అమలు చేయనున్నారు. సదరన్ డిస్కం పరిధిలో స్కీంను ఎక్కడ అమలు చేయాలి? ధరలు ఎలా నిర్ణయించాలి? ఏ టెక్నాలజీ వాడాలి? అన్న దానిపై ఇంటర్నేషనల్ కాపర్ సొసైటీ ఇండియా, ఐసీసీ త్వరలో సర్వే నిర్వహించనున్నాయి. ఈ స్కీంకు టెక్నాలజీ, పెట్టుబడులను ఈఈఎస్ఎల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సమ కూరుస్తాయి. స్కీంను రూపొందించడంతోపాటు అమలు చేయడానికి కాపర్ సొసైటీ సహకారం అందిస్తుంది. కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎనర్జీ ఆడిట్ డీపీఈ డైరెక్టర్ గోపాల్, సీజీఎం రగనాథాయ్, ఈఈఎస్ఎల్ ఈడీ ఎస్పీ గార్నిక్, ఈఈఎస్ఎల్ క్లస్టర్ హెడ్ సావిత్రి సింగ్, తదితరులు పాల్గొన్నారు.