సుడా పరిధిలో పనులు పూర్తిచేయాలి : చైర్మన్ నరేందర్ రెడ్డి

సుడా పరిధిలో పనులు పూర్తిచేయాలి : చైర్మన్ నరేందర్ రెడ్డి

కరీంనగర్ టౌన్, వెలుగు: శాతవాహన అర్బన్ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ పరిధిలో రూ.5.1కోట్లతో చేపట్టనున్న 59 పనులను వెంటనే ప్రారంభించి, పూర్తిచేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం సుడా ఆఫీస్ లో మున్సిపల్ కమిషనర్  ప్రఫుల్ దేశాయ్ తో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరగా పనులు ప్రారంభించి, నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో బల్దియా ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, ఏఈ సతీశ్‌‌, తదితరులు పాల్గొన్నారు.