విమలక్కకు సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కారం

విమలక్కకు సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కారం

ముషీరాబాద్, వెలుగు: సుద్దాల హనుమంతు ప్రజా వాగ్గేయకారుడు అని హైకోర్టు జడ్జి జస్టిస్ జి. రాధారాణి అన్నారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం రాత్రి సుద్దాల హనుమంతు జానకమ్మ కళాపీఠం, సుద్దాల ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. అరుణోదయ విమలక్కకు సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారాన్ని అందజేశారు. 

అనంతరం జస్టిస్ రాధారాణి  మాట్లాడుతూ...ప్రజాకవిగా, కళాకారుడిగా కమ్యూనిస్టు ఉద్యమం కోసం జీవితం అంకితం చేసిన వ్యక్తి సుద్దాల హనుమంతు అని అన్నారు.  నిర్మాత, దర్శకుడు ఆర్.నారా యణమూర్తి మాట్లాడుతూ...తొలితరం ప్రజాకవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సుద్దాల హనుమంతు అని కొనియాడారు. ఈ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని విమలక్క తెలిపారు.