
సుధీర్ బాబు హీరోగా రూపొందుతోన్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. సోనాక్షి సిన్హా విలన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ప్రెర్ణా అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు.
సోమవారం ('సెప్టెంబర్ 15) మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. నవంబర్ 7న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హాతో పాటు దివ్యా ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడంతోపాటు ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుందని మేకర్స్ చెప్పారు.