
డిఫరెంట్ కాన్సెప్టులు సెలక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు సుధీర్ బాబు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు మేకర్స్. మంగళవారం ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించి అప్‌డేట్‌ను ప్రకటించారు.
దసరా కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇదొక ఫాదర్ అండ్ సన్ డ్రామా అని, దసరా సీజన్ తమ సినిమాకు పర్ఫెక్ట్ టైమ్ అని, త్వరలోనే డేట్‌ను రివీల్ చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, షియాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు. జై క్రిష్ సంగీతం అందిస్తున్నాడు...