
‘శ్రీదేవి సోడా సెంటర్’లో విలేజ్ లవర్‌గా కనిపించిన సుధీర్ బాబు.. నెక్స్ట్ సినిమాలో మరో డిఫరెంట్ పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. యాక్టర్ కమ్ రైటర్ హర్షవర్థన్ డైరెక్షన్‌లో ఓ సినిమాకి కమిటయ్యాడు సుధీర్. రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను నిన్న రామోజీ ఫిల్మ్‌సిటీలో స్టార్ట్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సీన్స్ తీస్తున్నట్టు చెప్పిన హర్ష.. ఇదో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని, సుధీర్‌ని ఎప్పుడూ చూడని మాస్ అవతార్‌లో చూపిస్తానని అన్నాడు. అతని రోల్ చాలా చాలెంజింగ్‌గా ఉంటుందట. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే రివీల్ చేయనున్నారు. నారాయణ దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.