రష్మీతో పెళ్లి.. దేవుడు తిప్పితే చేసుకుంటానేమో.. సుధీర్ కామెంట్స్ వైరల్

రష్మీతో పెళ్లి.. దేవుడు తిప్పితే చేసుకుంటానేమో.. సుధీర్ కామెంట్స్ వైరల్

సుడిగాలి సుధీర్(Sudigali Sudheer)-రష్మీ(Rashmi).. ఈ జంటకు తెలుగునాట ఉన్న క్రేజ్ అంతా.. ఇంతా.. కాదు. జబర్దస్త్(Jabardasth) స్టేజిపై మొదలైన ఈ జంట ప్రయాణం.. ఇద్దరూ ఆ షో నుండి బయటకు వచ్చాక కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. స్టేజీపై వీళ్ళ కెమిస్ట్రీని ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.. చేస్తున్నారు కూడా. అసలు వీళ్ళిద్దరిది నిజమైన లవ్వా లేక స్కిట్ లో భాగంగా చేస్తున్నారా  అని చాలా మందికి డౌట్స్ కూడా వచ్చాయి. అదే విషయాన్నీ ఈ ఇద్దరి దగ్గర ప్రస్తావించగా.. అవన్నీ జస్ట్ స్కిట్ కోసం చేసినవే అని ఓపెన్ గానే చెప్పేశారు. కానీ ఆడియన్స్ మాత్రం ఈ జంట పెళ్లి చేసుకుంటే బాగుండు అని అనుకున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి సుధీర్, రష్మీ పెళ్లి విషయం మరోసారి తెరపైకి వచ్చింది. సుధీర్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ కాలింగ్ సహస్ర. అరుణ్ విక్కిరాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో ఒక రిపోర్టర్.. రష్మితో సుధీర్ పెళ్లెప్పుడు? అని అడిగారు.

దానికి సమాధానంగా సుధీర్ మాట్లాడుతూ.. నాకు సంబందించిన ప్రతీ ఈవెంట్ ఈ ప్రశ్న నన్ను అడుగుతూనే ఉన్నారు. ఆడియన్స్ అంతగా మమ్మల్ని ఆదరించారు. అందుకు అందరికి మరోసారి నా కృతజ్ఞతలు. రష్మీతో చేసిన స్కిట్స్, వాటిలో మా కెమిస్ట్రీ అంతా స్క్రిప్ట్ లో భాగంగా చేసినవే. అది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఇక పెళ్లి అనేది నా చేతుల్లో లేదు. ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. నిజం చెప్పాలంటే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే నాకు లేదు. ఒకవేళ దేవుడు నన్ను పెళ్లి వైపు నడిపిస్తే..   చేసుకుంటానేమో.. అంటూ చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు సుధీర్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ :- బ్రేక్ ఫాస్ట్ గా గుమ్మడి గింజలు.. ఇక రోజంతా ఫుల్ ఎనర్జీ