సుధీర్ గోట్‌‌‌‌‌‌‌‌ షూటింగ్ పూర్తి

సుధీర్ గోట్‌‌‌‌‌‌‌‌ షూటింగ్ పూర్తి

‘జబర్దస్త్‌‌‌‌‌‌‌‌’ కామెడీ షోతో సుడిగాలి సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పాపులర్ అయిన సుధీర్ ఆనంద్‌‌‌‌‌‌‌‌.. ఓ వైపు టీవీ షోస్‌‌‌‌‌‌‌‌ కొనసాగిస్తూనే మరోవైపు హీరోగానూ వరుస సినిమాలు చేస్తున్నాడు. తను లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న చిత్రం ‘గోట్‌‌‌‌‌‌‌‌’. క్రికేట్‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామాలో సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా దివ్యభారతి నటిస్తోంది. అద్భుతం, టేనంట్ చిత్రాలను నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌‌‌‌‌‌‌ చివరి దశకు చేరుకున్నాయి.  సినిమా చాలా బాగా వచ్చింది. నేను నిర్మించిన చిత్రంలో ఉత్తమ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకముంది. 

త్వరలోనే టీజర్, పాటలు సహా అప్‌‌‌‌‌‌‌‌డేట్స్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం’ అని చెప్పారు. మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వి, అడుకులం నరైన్, ఆనందరామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని ఇతరముఖ్యపాత్రలు పోషించారు.