
వర్కవుట్‌కి ముందు శక్తినిచ్చే పుడ్ తినడం చాలా ముఖ్యం. అందుకని చాలామంది అరటిపండు తింటారు. అందరిలానే డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా అరటి పండు తింటుంటారు. అయితే, ఇందులోని ఫ్రక్టోజ్ అనే తీపి పదార్థం షుగర్ లెవల్స్‌ని పెంచుతుంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవాళ్లు ప్రి–వర్కవుట్ శ్నాక్గా అరటి పండుకు బదులుగా పుచ్చకాయ (వాటర్మెలన్) తినాలి అంటోంది
ఫుడ్ థెరపిస్ట్ రియా బెనర్జీ అంకోల.
పుచ్చకాయలో నీళ్లు ఎక్కువ. వర్కవుట్‌కి ముందు ఈ పండు తింటే హైడ్రేటెడ్‌గా ఉంటారు. ఈ పండు అరటిపండు అంత తియ్యగా ఉండదు. కారణం ఇందులో చక్కెర చాలా తక్కువ. వీటిలోని ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాదు ఈ ఫ్రూట్ తొందరగా అరుగుతుంది కూడా. citrulin,ఇందులోని మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్స్ కండరాల నొప్పిని తగ్గిస్తాయి. ఈ పండులో ఎక్కువగా ఉండే పొటాషియం కండరాలు పట్టకుండా చూస్తుంది. ఈ పండులోని విటమిన్–ఎ ఇమ్యూనిటీని పెంచుతుంది.
ఈ పండులోని సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ మెటబాలిజంలో అర్జినిన్ అమైనో యాసిడ్‌గా మారుతుంది. ఇది గుండె కండరాలు, ఇమ్యూనిటీ సిస్టం పనిచేయడంలో కీలకమైన నైట్రిక్ ఆక్సైడ్ తయారీకి చాలా అవసరం. పుచ్చకాయతో జ్యూస్ చేసుకొని తాగడం కంటే ముక్కలుగా కోసి తినడం బెటర్.
వర్కవుట్‌కి ముందు ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు తింటే అరగంటసేపు అలసట తెలియదు.