త్వరలో తెలంగాణకూ వస్తం : సుగుణా ఫుడ్స్​ జీఎం మురళి

త్వరలో తెలంగాణకూ వస్తం : సుగుణా ఫుడ్స్​ జీఎం మురళి

హైదరాబాద్​, వెలుగు: ఒకట్రెండు సంవత్సరాల్లో తెలంగాణ అంతటా రిటైల్​ అవుట్​లెట్లు ఏర్పాటు చేస్తామని సుగుణా ఫుడ్స్​ జనరల్​ మేనేజర్​ మురళీ సుందర్​ రావు (సేల్స్​, మార్కెటింగ్​) అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్, కెన్యాలోనూ తమకు స్టోర్లు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్​లో జరుగుతున్న పౌల్ట్రీ ఎక్స్​పోకు వచ్చిన సందర్భంగా ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. తమకు నాలుగు రాష్ట్రాల్లో ప్రాసెస్​ ప్లాంట్లతో పాటు దేశవ్యాప్తంగా 70 ఫీడ్స్​ మిల్స్​, 70 కి పైగా హ్యాచరీస్​ ఉన్నాయని వివరించారు. 40 వేల మందితో కలిసి తాము పనిచేస్తున్నాయని, వీరిలో కొందరు కాంట్రాక్టు వ్యవసాయం చేస్తారని చెప్పారు. ‘‘మాది కోయంబత్తూరు కేంద్రంగా పనిచేసే కంపెనీ. మాకు మొత్తం నాలుగు బ్రాండ్లు ఉన్నాయి.   సుగుణా చికెన్​, సుగుణా ఫీడ్స్​, డెల్​ఫ్రెజ్​ (స్టోర్డ్​మీట్​), మదర్స్​ డిలైట్​ (సోయానూనె) అనే నాలుగు బ్రాండ్లు ఉన్నాయి.

గత ఆర్థిక సంవత్సరంలో రూ.9,500 కోట్ల టర్నోవర్​ వచ్చింది. మేం ఏటా 5–8 శాతం గ్రోత్​సాధిస్తున్నాం. మేం ప్రపంచంలోనే తొమ్మిదో అతిపెద్ద బ్రాయిలర్​ ఉత్పత్తిదారులం. మా రైతుల పౌల్ట్రీఫారాల్లో కోళ్ల ఆరోగ్యం కోసం లేటెస్ట్ టెక్నాలజీలను వాడుతున్నాం. స్మార్ట్​ఫోన్​ నుంచే ఫారాన్ని కంట్రోల్​ చేయడానికి యాప్​ను తీసుకొచ్చాం. అయితే దాణాకు వాడే మక్కలు, సోయా ధరలు పెరగడం వల్ల రైతులు ఇబ్బందిపడుతున్నారు. నష్టాలు వస్తున్నాయి. మనదేశంలో చికెన్, గుడ్ల​ వాడకం చాలా తక్కువగా ఉంది. మాంసం ఎక్కువ తింటే హాని జరుగుతుందనే అపోహలు ఉన్నాయి. రైతుల లాభదాయకత, ఉత్పత్తిని పెంచడానికి మేం వారికి శిక్షణ ఇస్తున్నాం. సర్టిఫికెట్​ కోర్సుల కోసం మేం తమిళనాడులోని పొల్లాచిలో స్పైషలైజ్డ్​ పౌల్ట్రీ ఇన్​స్టిట్యూట్​ను కూడా నడుపుతున్నాం” అని మురళి వివరించారు.