
టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్(Suhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ప్రారంభంలో షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిన ఈ నటుడు.. మెల్లిగా సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించడం మొదలుపెట్టాడు.కలర్ ఫోటో సినిమాతో సోలో హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సుహాస్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. హీరోగా వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకున్నాడు.
ఇటీవలే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్(Ambajipeta Marriage Band) తో హిట్ అందుకున్న సుహాస్(Suhas) మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ప్రసన్నవదనం (Prasanna Vadanam). కొత్త దర్శకుడు అర్జున్ (Arjun) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మిస్తుండగా..వైవా హర్ష, సాయి శ్వేతా, నితిన్ ప్రసన్న కీ రోల్స్ చేస్తున్నారు.
Thrills for one and all 💥💥#PrasannaVadanam certified with U/A ❤️🔥
— BA Raju's Team (@baraju_SuperHit) April 30, 2024
All set for a grand worldwide release on May 3rd 🔥🔥#PrasannaVadanamTrailer 💥💥
▶️ https://t.co/KwCq8fGBHm@ActorSuhas @payal_radhu @RashiReal_ @ManikantaJS @ReddyPrasadLTC @edwardpereji9 @harshachemudu… pic.twitter.com/xoIiXi1Ml0
ఇప్పటికే పోస్టర్లు, టీజర్,ట్రైలర్ తో ఫుల్ హైప్ పెంచేసిన ఈ సినిమా మే 3న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ పనులు కంప్లీట్ అయినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ థ్రిల్లర్ మూవీకి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దీన్నీ రన్‍టైమ్ 2 గంటల 26 నిమిషాలు (146 నిమిషాలు)గా ఉంది. మరి వినూత్న కాన్సెప్ట్ తో వస్తున్నప్రసన్నవదనం సినిమాకుక్ సుహాస్ కు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.