విజయ్ ఆంటోనీ కూతురు మీరా సూసైడ్ నోట్ లభ్యం .. అందులో ఏముందంటే?

  విజయ్ ఆంటోనీ కూతురు మీరా సూసైడ్ నోట్ లభ్యం .. అందులో ఏముందంటే?

తమిళ నటుడు, సంగీత దర్శకుడు  విజయ్ ఆంటోనీ(Vijay antony) ఇంట పెను విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన పెద్ద కూతురు మీరా ఆంటోని(16) (Meera Antony)  మంగళవారం ఉదయం చెన్నైలోని (Chennai) డీడీకే రోడ్‌లోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. . 

లేటెస్ట్ గా మీరా సూసైడ్ నోట్ తన నోట్బుక్ లో లభ్యమైందంటూ పోలీసులు తెలిపారు. ఈ నోట్ లో మీరా ఎమోషనల్ గా రాస్తూ..నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను..మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను, నా స్నేహితులను మరియు ఉపాధ్యాయులను కోల్పోతాను..ఇక నేను లేకుండా నా ఫ్యామిలీ ఎంతోగాను బాధపడుతుంది..అంటూ మీరా లెటర్ లో పేర్కొంది. 

మీరా విజయ్ ఆంటోనీ మరియు ఫాతిమా దంపతులకు పెద్ద కుమార్తె, మరియు ఆమె 2007లో జన్మించింది. వైద్య వృత్తిని కొనసాగించాలనే ఉద్దేశ్యంతో.. మీరా స్థానిక ప్రైవేటు  మెడికల్ కాలేజ్లో ఇంటర్‌ చదువుతుంది. చదువులో టాపర్ అయినప్పటికీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఎవ్వరు నమ్మలేకపొతున్నారు.

ఇక మీరా గత కొన్ని నెలలుగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు, చికిత్స కూడా పొందుతున్నట్లు రీసెంట్గా  పోస్ట్ చేసింది. విజయ్ ఆంటోనీ కూతురు ఆకస్మిక మరణంతో కుటుంబం అంతా శోకసంద్రంలోకి వెళ్ళింది. మీరా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆత్మహత్యే అని, ఆమె మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్..ఫాతిమా దంపతులకు లారా అనే చిన్న కూతురు కూడా ఉంది.