
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ప్రేమించిన యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో యువకుడు సూసైడ్చేసుకున్నాడు. చుంచుపల్లి మండలం పెనగడపకి చెందిన ఏసుపాక గణేశ్(24), అదే గ్రామంలోని యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం ఇద్దరి ఇండ్లలో తెలిసింది. క్యాస్టులు కూడా ఒకటే కావడంతో యువతి పేరెంట్స్పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పారు. ఇటీవల యువతి పేరెంట్స్గణేశ్తో పెళ్లి చేసేందుకు నిరాకరించారు. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు బుధవారం పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ట్రీట్మెంట్పొందుతూ గురువారం తెల్లవారుజామున గణేశ్మృతి చెందాడు. యువతి పేరెంట్స్వేధింపులతోనే గణేశ్చనిపోయాడని మృతుని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు.