కేజ్రీవాల్ చెప్తే బీఆర్ఎస్కు రూ. 75 కోట్లు ఇచ్చిన

కేజ్రీవాల్ చెప్తే బీఆర్ఎస్కు రూ. 75 కోట్లు ఇచ్చిన

మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ విడుదల చేశాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెబితే బీఆర్ఎస్ కు రూ. 75 కోట్లు ఇచ్చానన్నారు. రూ. 15 కోట్లు చొప్పున ఐదుసార్లు  బీఆర్ఎస్ నేతలకు రూ. 75 కోట్లు ఇచ్చినట్లను ఓ లేఖలో వెల్లడించాడు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఆఫీసు దగ్గర పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చానని తన లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేక కలకలం రేపుతోంది. 


కేజ్రీవాల్ చెప్తే 2020లో హైదరాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్ వద్దకు తాను వచ్చినట్లు సుఖేష్ చంద్రశేఖర్ వెల్లడించాడు. ఆ సమయంలో రేంజ్ రోవర్ కారులో ఏపీ అనే వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చినట్లు సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు. కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ చెప్పినట్లు ఏపీ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చినట్లు తెలిపాడు. మరో వారంలో కేజ్రీవాల్తో చేసిన వాట్సప్ చాటింగ్ ను బయటపెడతానన్నారు. చాటింగ్ లో కోడ్ పదాలు వాడారన్నారు. 15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించాలని కేజ్రీవాల్ చెప్పినట్లు సుఖేష్ చంద్రశేఖర్ వెల్లడించాడు  కేజ్రీవాల్ అవినీతి, అక్రమాలు అన్నీ బయటపెడతానని సుఖేష్ అన్నారు.