ఎమ్మెల్యే గాంధీ బెదిరిస్తున్నడు..హైకోర్టులో సులోచన అగర్వాల్ పిటిషన్

ఎమ్మెల్యే గాంధీ బెదిరిస్తున్నడు..హైకోర్టులో సులోచన అగర్వాల్ పిటిషన్
  • నా ఫ్యాక్టరీలో యంత్రాలను ఎత్తుకెళ్లిండు 
  • హై కోర్టులో  సులోచన అగర్వాల్  పిటిషన్ 
  • నివేదిక సమర్పించాలని పోలీసులకు కోర్టు ఆదేశం 

 హైదరాబాద్ : జీడిమెట్ల లోని సర్వే నంబర్ 38/8, 38/9 లో ఉన్న  భూమిని తన పేరిట రిజిస్టర్  చెయ్యాలంటూ తన కుటుంబాన్ని బెదిరించారని శేరిలింగంపల్లి  ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ పై  హైకోర్టులో సులోచన అగర్వాల్ పిటిషన్ వేశారు. అర్ధ రాత్రి ఎమ్మెల్యే గాంధీ మనుషులు తన  ఫ్యాక్టరీ లో దోపిడీ చేసినా  పోలీసులు స్పందించలేదని పిటిషన్ లో తెలిపారు.  ఇరవై కోట్ల రూపాయల యంత్రాలను,  అల్యూమినియం బండిల్ లను గాంధీ పోలీసుల సాయంతో తీసుకెళ్లారని  కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  పిటిషన్ ను విచారించిన హై కోర్టు ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఇన్ స్పెక్టర్  ప్రశాంత్, ఎస్ ఐ మల్లేశ్వర్ లను   ఆదేశించింది. ఎమ్మెల్యే గాంధీ కి వ్యక్తిగతంగా నోటీసులు పంపాలని పిటిషనర్ కు కోర్టు సూచించింది. తదుపరి విచారణ ఆగస్టు 10కి వాయిదా వేసింది.