ఎమోషన్‌‌‌‌తో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసేలా సుమంత్ గోదారి గట్టుపైన

ఎమోషన్‌‌‌‌తో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసేలా సుమంత్ గోదారి గట్టుపైన

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్  జంటగా సుభాష్​ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై అభినవ్ నిర్మించిన చిత్రం ‘గోదారి గట్టుపైన’. మే 8న సినిమా విడుదలవుతున్న సందర్భంగా  చిత్ర విశేషాలను గురించి అభినవ్‌‌‌‌ మాట్లాడుతూ ‘పదేళ్లుగా విభిన్నమైన వ్యాపారాల్లో ఉన్న నేను సినిమాపై ప్యాషన్‌‌‌‌తో మంచి స్క్రిప్ట్ కోసం దాదాపు పది కథలు విన్నాను. అందులో సుభాష్‌‌‌‌ చెప్పిన స్టోరీ, అందులోని ఎమోషన్స్‌‌‌‌ నచ్చాయి. 

గోదావరి నేపథ్యంలో జరిగే స్టోరీ కనుక నేటివిటీకి తగ్గట్టుగా నేనే ఈ టైటిల్‌‌‌‌ను సజెస్ట్ చేశాను. ఇక పక్కా తెలంగాణ మాట్లాడే సుమంత్ ప్రభాస్‌‌‌‌, గోదారి స్లాంగ్‌‌‌‌ మాట్లాడటం కష్టమే. కానీ ఓ నటుడిగా ఇలాంటి ఛాలెంజెస్‌‌‌‌ను ఇష్టపడే సుమంత్ గోదారి యాసను పర్ఫెక్ట్‌‌‌‌గా నేర్చుకున్నాడు. దర్శకుడు సుభాష్ చాలా డెడికేషన్‌‌‌‌తో పనిచేస్తారు.

టెక్నికల్‌‌‌‌గాను చాలా స్ట్రాంగ్. షూటింగ్‌‌‌‌కు ముందే ప్రతీ ఫ్రేమ్ పేపర్‌‌‌‌‌‌‌‌పై చూపించారు. పక్కా ప్లానింగ్‌‌‌‌తో షూటింగ్ చేశాం. దర్శకుడు ఎమోషనల్ సీన్స్‌‌‌‌ రాసిన విధానం, తీసిన విధానం చాలా పెక్యులర్‌‌‌‌. దాంతో పాటు కామెడీ, డ్రామా అద్భుతంగా బ్లెండ్ అయ్యాయి. తను రాసుకున్న పాత్రకు నిధి పర్ఫెక్ట్‌‌‌‌గా సరిపోయింది. 

జగపతి బాబు గారితో ఆమె సీన్స్‌‌‌‌ చాలా బాగా వచ్చాయి.   ఫస్ట్ మూవీ జర్నీ కొంత టఫ్‌‌‌‌గా ఉన్నా నాకు నచ్చింది.  ఇండస్ట్రీ ఏదైనా టఫ్ ఉంటేనే బాగుంటుంది. సునీల్ నారంగ్ గారు నాకు శ్రేయోభిలాషి, మార్గదర్శి. ఆర్టిస్టుల ఎంపిక మొదలు రిలీజ్ వరకు చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు.  నైజాంలో నేను, ఆయన కలిసి రిలీజ్ చేస్తున్నాం.  సీడెడ్‌‌‌‌లో తిరుపతి ప్రసాద్ గారు, ఆంధ్రలో సురేష్ బాబు గారు రిలీజ్ చేస్తున్నారు. 7వ తేదీ సాయంత్రం ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు.