
న్యూఢిల్లీ : ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ మోంటెకార్లో మాస్టర్స్ టోర్నమెంట్ మెయిన్ డ్రాకు క్వాలిఫై అయ్యాడు. దాంతో 42 ఏండ్ల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించాడు.
ఆదివారం జరిగిన ఫైనల్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సుమిత్ 7–5, 2–6, 6–2తో 55వ ర్యాంకర్ డియాజ్ అకొస్టా (అర్జెంటీనా)ను ఓడించి మెయిన్ డ్రాలో అడుగు పెట్టాడు.