
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ స్టూడెంట్స్ పరీక్షలపైనా పడింది. 21 నుంచి జరగాల్సిన సమ్మెటివ్ అసెస్‌మెంట్ -1(ఆర్నెళ్ల పరీక్షలు) పరీక్షలు రెండ్రోజులు వాయిదా పడ్డాయి. సమ్మె నేపథ్యంలో స్కూళ్లకు సెలవులను ఈ నెల 20 వరకు ప్రభుత్వం పొడిగించింది. దీంతో ఎగ్జామ్స్ తేదీలూ మారాయి. ఈ నెల 23 నుంచి30 వరకూ ఎస్‌ఏ-1 పరీక్షలు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ సోమవారం చెప్పారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 23 నుంచి 30 వరకూ పరీక్షలు ఉంటాయన్నారు.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్టూడెంట్లకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరు, ఏడో తరగతి స్టూడెంట్స్‌కు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, 8 వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు, 9,10 వ తరగతి స్టూడెంట్స్‌కు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పేపర్ -2 పరీక్షలు నిర్వహించాలని సూచించారు.