
ఎండాకాలంలో బయటకు వెళితే చాలు.. బ్యాగ్ లో వాటర్ బాటిల్ కంపల్సరీగా పెట్టుకుంటాం. అయినా సరే శరీరం డీ హడ్రేషన్ కు గురవుతుంది. ఆరోగ్యంగా శరీరం హైడ్రేడ్గా ఉండాలంటే శనగపిండి షర్బత్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. శనగపిండితో షర్ బత్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .
ఈ ఏడాది ( 2025) సమ్మర్ సీజన్ మండి పోతుంది. పది దాటితే బయటకు రావాలంటే జనాలు బిక్కు బిక్కు మంటున్నారు. ఉద్యోగస్తులు వెళ్లక తప్పదు.. అలానే చిరాగ్గా.. చెమట కంపుతో.. నీరసంగా వెళుతున్నారు. ఈ సమయంలో శరీరాన్ని హైడ్రేడ్గా ఉంచుకోవాలంటే శనగపిండితో తయారు చేసిన షర్బత్ పానీయాన్ని వెంట బాటిల్ లో ఉంచుకొని గంటకొకసారి టీ గ్లాసులో సగం తాగాలని చెబుతున్నారు నిపుణులు. శనగపిండితో షర్ బత్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .
శనగపిండి షర్ బత్ తయారీకి కావలసిన పదార్ధాలు
- శనగపిండి : అర కప్పు
- కొత్తిమీర ఆకులు : 10
- పుదీనా ఆకులు : 10
- నిమ్మరసం : 2 టీస్పూన్లు
- పచ్చిమిర్చి : ఒకటి
- వేయించిన జీలకర్ర: అర టీస్పూన్
- నల్ల ఉప్పు : అర టీస్పూన్
- ఉప్పు : 1/4 టీస్పూన్
తయారీ విధానం: మొదట ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని, ఆపై దానికి కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ ఉండండి. ద్రావణంలో గడ్డలు లేకుండా ఉండాలి . ఈ మిశ్రమానికి కొంచెం నిమ్మరసం వేసి, ఆపై కాల్చిన జీలకర్ర .. నల్ల ఉప్పు కలపండి. ఈ రెండూ దాని రుచిని పెంచడానికి పనిచేస్తాయి. తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి వేయించాలి. తరువాత ఇందులో చల్లటి నీటిని కలపాలి. ఇప్పుడు ఈ షర్ బత్‌ను గ్లాసులో ఫిల్టర్ చేయాలి. ఇది చల్లగా ఉండానుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ కలుపుకోండి.
Also Read : బుల్లి బుల్లి ఆలుగడ్డలు
వేసవిలో శనగపిండి షర్ బత్ తాగడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుంది. మీ శరీరం లోపలి నుండి చల్లగా ఉంటుంది. శరీర హైడ్రేషన్ .. శక్తితో పాటు రోగనిరోధక శక్తి ని కూడా కలుగజేస్తుంది. మరి సమ్మర్ లో శరీరానికి ఉపయోగపడే శనగపిండి షర్ బత్ తాగి ఆరోగ్యాన్ని కాపాడుకుందామా మరి..!