
హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో ఎండలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఆదివారం కాస్త శాంతించిన భానుడు సోమవారం మళ్లీ ప్రతాపం చూపించాడు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ , మెండోరాల్లో అత్యధికంగా 44.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ ,భద్రాచలంలో 30 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కరీంనగర్ , జనగామ, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ , సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసింది. బుధవారం కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.