రోహిణిలో రోళ్లు పగులుతున్నయి

రోహిణిలో రోళ్లు పగులుతున్నయి
  • జగిత్యాల జిల్లా కొల్వాయిలో 47.9 డిగ్రీల టెంపరేచర్
  • రామగుండంలో 47.2 డిగ్రీలు
  • తొమ్మిదేళ్ల తర్వాత మే నెలలో
  • మళ్లీ ఆ స్థాయి టెంపరేచర్‌
  • వడదెబ్బతో పిట్టల్లా రాలుతున్న జనం
  • రోజూ సగటున రాష్ట్రం లో 10–15 మంది మృతి
  • ఈ సీజన్ లో ఇప్పటిదాకా 200 మందిపైనే..
  • మరో వారం దాకా ఇంతే..

హైదరాబాద్‌, వెలుగు: రోహిణి కార్తెలో రోళ్లు పగులుతున్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థా యి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ ఇచ్చిన ఆటోమేటిక్‌ సెన్సార్‌ వివరాల ప్రకారంసోమవారం జగిత్యాల జిల్లాలోని కొల్వాయి,రాజారామ్ పల్లిలో గరిష్టంగా 47.9 డిగ్రీల టెంపరేచర్‌ నమోదైంది . మంచిర్యాల జిల్లా ర్యాలీ,జగిత్యాల జిల్లా జైనలో 47.7, జయశంకర్‌ భూపాలపల్లిలోని ములుగు, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌, సిద్దిపేట జిల్లాలోని కట్కూర్‌లో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం లెక్కల ప్రకారం సోమవారం రామగుండంలో 47.2 డిగ్రీలు నమోదైంది. గత తొమ్మిదేళ్లలో మే నెలలో ఇదే రికార్డు టెంపరేచర్‌.2010లో మే 26న 47.2 డిగ్రీలు నమోదైంది .ఎండలు, వడగాల్పులతో జనాలు అల్లాడుతున్నారు. వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది . మరోవైపు జలాశయాలు ఎండిపోతున్నాయి.

పడిపోతున్న తేమ శాతం

రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చేంత వరకు ఇవే టెంపరేచర్లు ఉంటాయని తెలిపింది. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు,మెరుపులతో తేలికపాటి వర్షా లు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మండే ఎండలకు తోడు గాలిలో తేమ శాతం కూడా పడిపోతోం ది. సోమవారం నిజామాబాద్‌ జిల్లాలో గాలిలో తేమ శాతం 19 శాతానికి పడిపోయిం ది. ఆదిలాబాద్‌ లో 21, హైదరాబాద్‌ , రామగుండంలో 24, మహబూబ్‌ నగర్‌ లో 28 శాతానికిపడిపోయిం ది. మరోవైపు వడగాడ్పుల ప్రభావంతోపిల్లలు, వృద్ధులు అల్లాడుతున్నారు. వారం రోజులుగాప్రతిరోజూ రాష్ట్రంలో 10 నుం చి 15 మంది వరకు వడదెబ్బతో చనిపోతున్నారు. ఈ సీజన్‌ లో ఇప్పటిదాకా200 మందికిపైగా మరణించినట్లు తెలుస్తోంది.

పాతాళానికి జలం

మండే ఎండలతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ లో భూగర్భ జలాల లభ్యత 14.14 మీటర్ల వద్ద ఉండగా గతేడాది ఇదే సమయానికి 12.77 మీటర్ల వద్ద ఉన్నాయి. అంటే గతేడాదితో పోలిస్తే ఈ సారి 1.37 మీటర్ల కిందకుపడిపోయాయి. జిల్లాల వారీగా చూస్తే ఈ సీజన్‌ లో అత్యధికంగా మెదక్‌ లో 4.54, వికారాబాద్‌ లో 4.41,మేడ్చల్‌ లో4.02, భూపాలపల్లిలో 3.88 మీటర్ల మేర భూగర్భ జల మట్టాల పడిపోయాయి. జలాశయాలు కూడా ఎండిపోతున్నాయి. కృష్ణా , గోదావరి రిజర్వాయర్లు దాదాపు ఖాళీ అయి ఎడారిని తలపిస్తున్నాయి.కృష్ణా బేసిన్‌ లోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు బాగా పడిపోయాయి. పల్లెల్లో అనేకచోట్ల తాగునీళ్లు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు.

పెరుగుతున్న కరెంట్‌ వినియోగం

ఎండలు పెరిగే కొద్దీ రాష్ట్రంలో కరెంట్‌ డిమాండ్‌ పెరిగిపోయిం ది. ఈ ఏడాది మే నెలలో (27వ తేదీ వరకు) 8,126 మెగావాట్ల విద్యుత్‌ ను వినియోగించగా గతేడాది ఇదే సమయానికి 6,865 మెగావాట్లు మాత్రమే వినియోగిం చారు. ఒక్క ఎస్పీడీసీఎల్‌ పరిధిలోనే ఈ నెల 5,963 మెగావాట్ల కరెంట్‌ వాడగా,కిందటేడాది ఇదే టైంకు 4,897 మెగావాట్లు వినియోగిం చారు.

జాగ్రత్తలు తీసుకోండి..

ఎండలు ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ లు సూచిస్తున్నారు. ఆరు బయట పనిచేసేవారు తరచుగా నీళ్లు తాగాలి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. తెలుపు, లేత రంగులున్న పలుచని కాటన్‌ దుస్తులు ధరిం చాలి.టోపీ పెట్టుకోవాలి. ఓఆర్‌ ఎస్‌ ద్రావణం తాగితే వడదె-బ్బ నుం చి కాపాడుకోవచ్చు. చంటిపిల్లలు, గర్భిణులు,వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఎండలో తిరగవద్దు. అధిక వేడి సమయాల్లో కాఫీలు, టీలు తాగొద్దని డాక్టర్ లు సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ దాటితే వడదెబ్బ తగులుతుం దని, కళ్లుతిరగడం, తీవ్రమైన తలనొప్పి , గుండె దడ, చెమటలు రావడం, కిడ్నీలు చెడిపోవడం, ఫిట్స్‌ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు.

సగటున 46 డిగ్రీలు

రాష్ట్రంలో మే 4 నుం చి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వారం రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయి. ఉత్తరతెలంగాణ జిల్లాలలో 44-–46 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రుతుపవనాలు ప్రవేశించేంత వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. జూన్‌ రెండో వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు వస్తాయి.- రాజారావు, డైరెక్టర్‌ , హైదరాబాద్‌‌‌‌ వాతావరణ కేంద్రం