ఎండల్లెక్కనే మండుతున్నయ్‌

ఎండల్లెక్కనే  మండుతున్నయ్‌

టమాటా, పచ్చిమిర్చి ధరలు మళ్లీ పైపైకి ఎగబాకుతున్నయి. రాష్ట్రంలో సాగు తగ్గడం, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి లేకపోవడంతో సిటీ మార్కెట్లలోకి లో టమాట రూ.55 నుంచి రూ.70 దాకా పలుకుతోంది. పచ్చిమిర్చి ధర వింటేనే నోటమాట రాని పరిస్థితి ఉంది. కిలో మిర్చి రైతు బజార్ లో రూ.70 ఉండగా బహిరంగ మార్కెట్ లో రూ.90దాకా అమ్ముతున్నరు. రాష్ట్రంలో మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో సాగు తగ్గడంతో ఏపీలోని మదనపల్లి, కర్నాటకలోని కొలార్, చిక్ మగళూర్ ల నుంచి దిగుమతి అయ్యే టమాటాలపై ఆధారపడాల్సి వస్తుంది.

సీజన్‌ మొదట్లో మార్కెట్ కు 100 నుంచి 150 లారీ లు వస్తుండగా, ప్రస్తుతం 60 నుంచి 70 లారీలే వస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్‌ నుంచి దిగుమతులు ఉంటేనే ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుందని, లేకుంటే మరో మూడు నెలలపాటు ధరల్లో పెరుగుదల తప్పదని మార్కెట్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.