V6 News

రేపటి( ఏప్రిల్ 24) నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్..జూన్ 12న రీఓపెన్

రేపటి( ఏప్రిల్ 24) నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్..జూన్ 12న రీఓపెన్

స్కూళ్లకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి జూన్ 11 వరకు హాలిడేస్ కొనసాగుతాయి. తిరిగి జూన్ 12న బడులు ప్రారంభమవుతాయి. ఈ విద్యా సంవత్సరం చివరి పనిదినం నేటితో ముగియనుండడంతో దాదాపు 50 రోజుల పాటు పిల్లలు సెలవులను ఎంజాయ్​ చేయనున్నారు.

హైదరాబాద్, వెలుగు: స్కూల్ పిల్లలకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి జూన్ 11 వరకు హాలీడేస్ కొనసాగుతాయి. తిరిగి జూన్ 12న బడులు పునః ప్రారంభమ వుతాయి. ఈ విద్యా సంవత్సరం చివరి పనిదినం నేటితో ముగియనుండడంతో దాదాపు 50 రోజుల పాటు పిల్లలు సెలవుల్లో సందడి చేయనున్నారు.

 అకాడమిక్ ఆఖరి రోజైన గురువారం  అన్ని సర్కారు స్కూళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో 'పేరెంట్స్ టీచర్స్ మీటింగ్' (పీటీఎం) నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. వేసవి సెలవుల్లో పిల్లలను చదువుతో పాటు ఇతర సృజనాత్మక పనుల్లో ఎలా నిమగ్నం చేయాలనే దానిపై చర్చించాలని సూచించారు.