చెమట, ఉక్కపోత వల్ల వేసవిలో మేకప్ త్వరగా చెదిరిపోతుంది. అలా కాకూడదంటే మేకప్ వేసుకునే ముందు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
మేకప్ వేసుకునే గంట ముందు శుభ్రంగా చన్నీళ్లతో ముఖం కడుక్కుని , సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. మాయిశ్చరైజర్ రాసుకున్న తరువాత ఫౌండేషన్ వేసుకోవాలి. వీలైతే కాసేపు మసాజ్ చేశాక ఫౌండేషన్ రాయాలి. వీలైనంత వరకు లిక్విడ్ , మాయిశ్చరైజర్ బేస్డ్ ఫౌండేషన్స్ ఎంచుకోవాలి. అలాగే ఎస్పిఎఫ్ లేని ఫౌండేషన్ ఎండా కాలంలో బెస్ట్ ఆప్షన్.
లిక్విడ్, క్రీం బ్రాంజర్స్కి దూరంగా ఉండాలి. వేడి వల్ల ఇవి ఇంకా జిడ్డుగా కనిపిస్తాయి. వీటికి బదులుగా మ్యాటీ రకాలు ఎంచుకోవచ్చు
వాటర్ ఫ్రూవ్ ఐ–లైనర్, షాడో, మస్కారా, అండర్ ఐ– కన్సీలర్లు వాడటం వల్ల ఐ మేకప్ ఎండకు, చెమటకు కరగదు. ఈ కాలంలో పెదాలకు లిప్‌స్టిక్ వేసుకోవాలంటే ముందుగా పెదాలను కాస్త రుద్దాలి. తరువాత లిప్‌బామ్ రాసుకోవాలి. అదయ్యాక పెన్సిల్‌తో లిప్‌లైన్ గీసుకుని లిప్ గ్లాస్ వాడాలి.
