ఎండాకాలం షురూ.. మహబూబ్ నగర్ లో అత్యధికం

ఎండాకాలం షురూ.. మహబూబ్ నగర్ లో అత్యధికం

మండే కాలం మొదలు మహబూబ్ నగర్ లో గరిష్టంగా 36.1 డిగ్రీలు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మండే కాలం వచ్చేసింది. రోజురోజుకు ఎండలు పెరుగు తున్నాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నాయి. మహబూబ్ నగర్ లో ఎక్కు వగా 36.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ లో 35.6, భద్రాచలంలో 35, ఖమ్మంలో 34.2 , నిజామాబాద్ లో 33.9 డిగ్రీల చొప్పున ఉష్ణో గ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్ లో తక్కు వగా 16.2 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలో మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారిందని చెప్పారు. దక్షిణ దిశ నుంచి గాలులు వీస్తున్నాయన్నారు.