రాష్ట్రంలో మండుతున్న ఎండలు : 39 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో మండుతున్న ఎండలు : 39 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

మార్చి రాకముందే సూరీడు మంటపెడుతుండు. రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నయి. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 38.6 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం భగ భగమనే ఎండ చూసి ప్రజలు ఇళ్లల్లోంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయం 7 నుంచి మొదలైన ఎండకు సాయంత్రం 6 గంటల దాకా వేడి తగ్గడంలేదు ఉదయం పది గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఎండలు పెరగడం సాధారణమేనని, ఎప్పటికంటే ఈ సారి ఎండలు ఎక్కువగా ఉంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్‌, మే నెలల్లో 45 డిగ్రీలకు చేరొచ్చని అధికారులు చెబుతున్నారు.