
హైదరాబాద్, వెలుగు : హైకోర్టుకు మే 2 నుంచి జూన్ 3 వరకు వేసవి సెలవులను ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. సెలవుల సమయంలో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ బెంచ్‌లు పనిచేస్తాయి. ఇలాంటి కేసులను మే 2, 9, 16, 23, 30 తేదీల్లో దాఖలు చేసుకోవచ్చు. ఇలా దాఖలు చేసే రిట్ పిటిషన్లను వరుసగా మే 5, 12, 19, 26, జూన్ 2వ తేదీల్లో ఇద్దరు జడ్జీల డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జీల బెంచ్‌లు విచారణ చేస్తాయి. హెబియస్ కార్పస్ పిటిషన్లు, ముందస్తు బెయిల్, బెయిల్ అప్లికేషన్లు, కింది కోర్టులు బెయిల్ తిరస్కరణపై అప్పీల్ ఇతర ఎమర్జెన్సీ కేసుల్ని మాత్రమే వెకేషన్ కోర్టులు విచారిస్తాయి. లంచ్‌మోషన్, అత్యవసర కేసుల్ని విచారణ చేస్తాయి.