
తులారాశిలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు (నీచ స్థితి పొందుతాడు). దీని వలన కొన్ని రాశుల వారు సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశిలో .. సూర్యుడు శుక్రుడు తులారాశిలో నవంబర్ 17 వరకు నీచ స్థితిలో కొనసాగుతారు. ఈ రెండు ప్రధాన గ్రహాలు నీచబడి నప్పటికీ కొన్ని రాశులకు మాత్రం ఇవి రాజయోగాలు కలిగిస్తాయి. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .
సింహ రాశి : ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో రాశ్యధిపతి సూర్యుడు నీచబడడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా హోదా, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారమై, సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందడం జరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
తులా రాశి : ఈ రాశి వారు సూర్యుడు, శుక్ర గ్రహాల కలయిక నుండి మంచి ప్రయోజనాలను పొందబోతున్నారు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంశలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉంది. గతంలో మిమ్మలను వ్యతిరేకించిన వారు మీ సహాయం కోసం వస్తారు. వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు వడ్డీతో కలిపి లాభాలు పొందుతారు. ఎవరితోనైనా ప్రేమలో ఉంటే ఈ సమయంలో ప్రేమను చెప్పండి..
ధనుస్సు రాశి : దశమ స్థానంలో శుక్రుడు.. లాభ స్థానంలో సూర్యుడు నీచ స్థితిలో తులారాశిలో కలవడం వలన ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యలు కొలిక్కివస్తాయి. ఉద్యోగస్తులు హోదా పెరగడంతో పాటు ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి.
మకరరాశి : భాగ్య స్థానంలో శుక్రుడు, తులారాశిలో సూర్యుడు నీచబడడం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో సీనియర్లను కాదని అందలాలు ఎక్కుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.పూర్వీకుల లభించడంతో పాటు ఆస్తిపాస్తులు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
వృషభ రాశి: శుక్రుడు... ధన స్థానంలో కి ప్రవేశించడం.. సూర్యుడు నీచబడడం వల్ల ఈ రాశి వారికి ఆదాయం పెరిగి , ఖర్చులు బాగా తగ్గుతాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపుగా పద్నోతులు లభించడం, జీతభత్యాలు పెరగడం, ఊహించని ప్రాధాన్యం లభించడం వంటివి జరుగుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. గతంలో రాదనుకున్న రాదనుకున్న సొమ్ము, బాకీలు, బకాయిలన్నీ కొద్ది ప్రయత్నంతో చేతికందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి సూర్యుడు, శుక్రుడు కలయిక వలన సృజనాత్మక ప్రయోజనాలు కలుగుతాయి. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త బైక్, ఇంటి ప్లాట్లు కొనుగోలు చేయవచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇదే సరైన సమయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ప్రేమ వ్యవహారం బలపడుతుంది.