న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్.. జట్టులోకి రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రేయస్ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్.. జట్టులోకి రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రేయస్ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ముంబై: టీమిండియా ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యాడు.  సెలెక్టర్లు అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జట్టులోకి తీసుకున్నారు. వడోదరలో కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్నప్పుడు సుందర్ పక్కటెముకల కండరాల గాయానికి గురయ్యాడు. 

కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా.. అతను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్తాడని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా శుక్రవారం ప్రకటించారు. ఇక,  పొత్తికడుపు గాయంతో బాధపడుతున్న బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిలక్ వర్మ స్థానంలో వన్డే టీమ్ వైస్ కెప్టెన్‌‌ శ్రేయస్ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొలి మూడు టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.