యూపీలో మాస్క్ పెట్టుకోకుంటే రూ.10 వేలు ఫైన్

యూపీలో మాస్క్ పెట్టుకోకుంటే రూ.10 వేలు ఫైన్

లక్నో: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ ఎక్కువవుతోంది. సెకండ్ వేవ్‌‌లో మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరిగా మారింది. అందుకే మాస్కులు కట్టుకోవడం లాంటి జాగ్రత్తలను పాటించకపోతే చాలా రాష్ట్రాల్లో ఫైన్‌‌లు వేస్తున్నారు. తెలంగాణలో మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఈ విషయంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మరింత కఠినతరమైన రూల్స్ తీసుకొచ్చింది. మాస్క్ కట్టుకోకుండా తొలిసారి దొరికిన వారికి రూ.1,000 ఫైన్ , రెండోసారి దొరికితే ఏకంగా పది వేల రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించింది. కరోనా కేసులు పెరగకుండా తీసుకునే చర్యల్లో భాగంగానే ఈ రూల్‌‌ను తీసుకొచ్చామని యూపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా కట్టడికి రాష్ట్రంలో వారాంతంలో లాక్‌‌డౌన్ వేయాలని యోగి సర్కార్ నిర్ణయించింది. ఆదివారం రోజు అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.