
ఆదివారం వచ్చిందంటే చాలు.. సండే స్పెషల్ ఏంటని ఇరుగు పొరుగు వారు ముచ్చట్లాడుకుంటారు. రొటీన్ గా చికెన్.. మటన్.. ఫిష్ ఇలా చెబుతుంటారు. ఎప్పుడూ అదే తింటు బోరుగా ఉంటుంది. కాని చికెన్ తో వెరైటీ గా ఫ్రైడ్ చికెన్ మోమొస్.. చికెన్ కట్లెట్.. చికెన్ రోల్ తయారు చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. మరి ఇప్పుడు ఆ సరికొత్త చికెన్ రెసీపీలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . !
ఆదివారానికి, కోడికూరకి అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. ఆరామ్ సే ఇంట్లో కూర్చుని తింటే... ఆ కిక్కే వేరప్పా అన్నట్లు ఉంటుంది కదా! అందుకే మీ కోసం ఈ సండే స్పెషల్ చికెన్.
ఫ్రైడ్ చికెన్ మోమోస్ తయారీకి కావాల్సినవి
- మైదా పిండి : రెండు కప్పులు
- బేకింగ్ పౌడర్ :అర టేబుల్ స్పూన్
- ఉప్పు :తగినంత
- నూనె :సరిపడా
- చికెన్ ముక్కలు :ఒక కప్పు
- ఉల్లిగడ్డ తరుగు :అర కప్పు
- సోయా సాస్ : అర టేబుల్ స్పూన్
- వెనిగర్ : పాపు టేబుల్ స్పూన్
- వెల్లుల్లి తరుగు : అర టీ స్పూన్
- కారం లేదా మిరియాల పొడి : పావు టేబుల్ స్పూన్
- కొత్తిమీర తరుగు: పావు కప్పు
తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా పిండి, బేకింగ్ పౌడర్ వేసి సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలిపి పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడెక్కాక ఉల్లిగడ్డ, వెల్లుల్లి తరుగు వేయాలి. అవి వేగాక చికెన్ ముక్కలు వేయాలి. ముక్కలు బాగా వేగే వరకు మూత పెట్టాలి. తర్వాత సోయా సాస్, ఉప్పు, వెనిగర్, కారం లేదా మిరియాల పొడి వేయాలి. రెండు నిమిషాలయ్యాక కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి. ఇప్పుడు మైదాపిండిని చిన్నసైజు చపాతీల్లా చేసి, వాటి మధ్యలో చికెన్ మిశ్రమాన్ని పెట్టాక వాటిని మోమోల ఆకారంలో మడిచి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. వీటిని టొమాటో లేదా చిల్లీ సాస్‌తో తింటే. .. ఆ రుచే వేరు
చికెన్ కట్ లెట్ తయారీకి కావాల్సినవి:
- బోన్లెస్ చికెన్ : అర కిలో
- ఆలుగడ్డ (ఉడికించి... చిదిమిన): ఒక కప్పు
- ఉల్లిగడ్డ తరుగు : ఒక టేబుల్ స్పూన్
- నూనె : సరిపడా
- ఎండిన బ్రెడ్ పొడి : రెండు కప్పులు
- కారం : రెండు టీ స్పూన్లు,
- పసుపు : ఒక టీ స్పూన్,
- జీలకర్ర పొడి : ఒక టీస్పూన్
- ధనియాల పొడి: ఒక టీ స్పూన్
- గరం మసాలా పొడి: రెండు టీ స్పూన్లు
- ఉప్పు : తగినంత
- కొత్తిమీర తరుగు: పావు కప్పు
- అల్లం తరుగు : అర టీస్పూన్
- మొక్కజొన్న పిండి : నాలుగు టీ స్పూన్లు
తయారీ విధానం : ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కల్ని ఒక పెద్ద గిన్నెలో వేయాలి. వాటిలో కారం, ఆలుగడ్డ, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, కొత్తిమీర, అల్లం, ఉల్లిగడ్డ తరుగు, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుని, బిళ్లల్లా చేయాలి, తర్వాత పాన్ లో నూనె వేడిచేయాలి. చికెన్ బిళ్లలను ఎండిన బ్రెడ్ పొడిలో దొర్లించి నూనెలో వేయాలి. అలా అన్నింటినీ వేగించాక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ చికెన్ కట్ లెట్లను సాస్ లేదా చట్నీతో తింటే.. టేస్ట్ అదిరిపోతుంది
చికెన్ రోల్ తయారీకి కావలసినవి
- గోధుమ పిండి : ఒకటిన్నర కప్పు
- మైదా పిండి: అర కప్పు
- నూనె :సరిపడా
- ఉప్పు :తగినంత
- చికెన్ ముక్కలు (మెత్తటివి) :రెండు కప్పులు
- కారం :మూడు టీ స్పూన్లు
- పసుపు: ఒక టీ స్పూన్
- మిరియాల పొడి: అర టీ స్పూన్
- గరం మసాలా పొడి :ఒక టీ స్పూన్
- జీలకర్ర పొడి :అర టీ స్పూన్
- ధనియాల పొడి-: రెండు టీ స్పూన్లు
- అల్లం, వెల్లుల్లి పేస్ట్ : మూడు టీ స్పూన్లు
- నిమ్మరసం : ఒక టేబుల్ స్పూన్
- పెరుగు :ఒక టేబుల్ స్పూన్,
- మొక్కజొన్న పిండి: రెండు టేబుల్ స్పూన్లు
- ఉల్లిగడ్డ తరుగు: అరకప్పు
- కొత్తిమీర తరుగు : అర కప్పు
- టొమాటో తరుగు: పావు కప్పు
తయారీ విధానం : ఒక గిన్నెలో చికెన్ ముక్కలను వేసి... ఒకటిన్నర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఉప్పు, పెరుగు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, మొక్కజొన్న మసాలా పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఉప్పు, పెరుగు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, మొక్కజొన్న
పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంటసేపు పక్కన బెట్టి తర్వాత నూనెలో కొద్దిగా వేగించాలి.
Also Read : లెమన్ వాటర్ తయారీలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!
మరో గిన్నెలో గోధుమపిండి, మైదా పిండి, ఉప్పు వేయాలి. తగినన్ని నీళ్లు పోసి మెత్తగా కలిపి పక్కన పెట్టాలి.. పిండి కలిపేటప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటే, పిండి మృదువుగా వస్తుంది. తర్వాత మళ్లీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోయాలి.. అది వేడెక్కాక ఉల్లిగడ్డ టొమాటో తరుగు వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత ఉప్పు, మిగిలిన కారం, పసుపు,గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అవన్నీ వేగాక చికెన్ ముక్కలు, మిగిలిన నిమ్మరసం వేసి కలపాలి. మిశ్రమం దగ్గరికయ్యాక కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆపేయాలి. గోధుమపిండితో చపాతీలు చేసి కాల్చాలి. వాటి మధ్యలో చికెన్ మిశ్రమాన్ని పెట్టి రోల్ చేసి తింటే చాలా బాగుంటాయి