Summer season: లెమన్​ వాటర్​ తయారీలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!

Summer season:  లెమన్​ వాటర్​ తయారీలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!

ఎండాకాలం .. ఈ సీజన్​ లో  ఎక్కువమంది లెమన్​ వాటర్​ తాగుతారు.  దీనిని ఇంట్లోనే తయారు చేసుకుంటారు.  చాలామంది నిమ్మకాయ రసాన్ని నీళ్లలో పిండి.. కొద్దిగా పంచదార వేసి షర్​  బత్​ తయారు చేసుకుంటారు.  అయితే  ఈ షర్​బత్​ తయారు చేసేటప్పడు  వారికి ఇష్టమైన రీతిలో తయారు చేసుకుంటారు.  లెమన్​ షర్​బత్​ తయారుచేసుకొనే సమయంలో కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . . 

సమ్మర్​ సీజన్​లో లెమన్​ షర్​బత్​ తాగడం వలన  చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, హైడ్రేషన్‌ను కాపాడుకోవడానికి  ఇది ఎంతో ఉపయోగపడుతుంది.  నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

నిమ్మరసం ఎక్కువగా కలపడం:  నిమ్మరసం ఎక్కువుగా కలపకూడదు.   ఒక గ్లాసు నిమ్మరసానికి సగం నిమ్మరసం.. సగం నీళ్లు కలపాలి.  ఆదులో పంచదారకు బదులుగా ఉప్పు వేసుకోవాలి. పుల్లగా రుచిగా ఉండాలని కొంతమంది ఎక్కువ నిమ్మరసం కలుపుతారు. ఇది పొట్టలో చికాకును కలిగిస్తుంది.  అంతేకాదు మరీ పులుపు ఎక్కువుగా ఉంటే టేస్ట్​ కూడా పాడవుతుంది. 

గోరువెచ్చని నీటిని ఉపయోగించవద్దు:  లెమన్​ షర్​ బత్​ ను తయారు చేసేటప్పుడు.. వేడి నీటిని ఉపయోగించకూడదు.  చల్లని నీటిని మాత్రమే వాడాలి. వేడి నీటిలో నిమ్మరసం కలిస్తే పోషకవిలువులు ఉండవు. అంతేకాదు.. రుచి కూడా చెడిపోతుంది.  ఎండాకాలంలో వేడి నీరు తాగడం వలన ఉపయోగం ఉండదు కదా..! 

పంచదార :  లెమన్​వాటర్​ లో  పంచదార  వేయడం వలన నిమ్మరసంలో పోషక విలువలు తగ్గుతాయి.  పంచదారకు బదులుగా తేనె.. బెల్లం వాడాలి.  డయాబెటిస్​ ఉన్నవాళ్లకు ఇది మంచి ద్రావకం.  గ్లాసుడు నీళ్లకు రెండు స్పూన్ల తేనె కంటే ఎక్కువ కలపకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

నల్ల ఉప్పు:  నిమ్మరసంలో ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడండి.  ఇది జీర్ణక్రియకు ఎంతో ఉపయోగపడుతుంది.  నిమ్మరసంలో నల్ల ఉప్పు వాడితే  టేస్ట్​ కూడా బాగుంటుంది. 

నిమ్మకాయను ముందుగా కోయవద్దు:  కొంతమంది నిమ్మకాయను ముందుగానే కోసి  ఫ్రిజ్‌లో ఉంచుకుంటారు.  ఆ తరువాత రెండు మూడు గంటలకు నిమ్మరసం తయారు చేసుకుంటారు.  కానీ అలా చేయడం వల్ల నిమ్మరసం  తాజాదనాన్ని కోల్పోతుంది. ఎల్లప్పుడూ తాజా నిమ్మకాయను వెంటనే కోసి షర్బత్‌లో వాడుకోవాలి.

►ALSO READ | Summer Drink : శనగపిండి షర్​బత్​ .. ఇంట్లోనే తేలిగ్గా తయారు చేసుకోండి