
నేపాల్ లో జెనరేషన్-Z విప్లవం రోజు రోజుకూ విస్తరిస్తోంది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యంగ్ జనరేషన్ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినదిస్తూ యూత్ అంతా ఉద్యమ బాట పట్టారు. సోమవారం (సెప్టెంబర్ 08) నేపాల్ పార్లమెంటు ముందు భారీ ఎత్తున ప్రొటెస్ట్ నిర్వహించారు.
నగర వీధుల్లో యువతీ యువకులు చేస్తున్న ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఉప్పెనలా వచ్చిన జనందోహాన్ని తట్టుకోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో అక్కడక్కడా లాఠీచార్జి చేయగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు గన్ పైర్ చేయడంతో పలువురు ఉద్యమకారులు గాయపడ్డారు.
Gen Z Revolution.. అనే స్లోగన్స్ ఇస్తూ వేల మంది యువకులు రాజధాని కాట్మండు వీధులను చుట్టు ముట్టారు. పార్లమెంటు వైపు దూసుకుపోతున్న నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నంలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. దీంతో పార్లమెంటు పరిసరాల్లో కర్ఫ్యూ విధించారు.
►ALSO READ | పబ్లిక్ ప్లేస్లో యూరిన్ వద్దన్నందుకు కాల్చి పడేశారు.. అమెరికాలో భారత యువకుడి హత్య
దేశంలో సోషల్ మీడియా బ్యాన్ చేయడంతో యువత పెద్దఎత్తున నిరసనలకు దిగారు. తమ వాక్ స్వాతంత్ర్యాన్ని కాల రాస్తున్నారంటూ ఆందోళనబాట పట్టారు. సెప్టెంబర్ 04 న ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ తదితర 26 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను బ్యాన్ చేయడంతో ఉద్యమం మొదలైంది. దీంతో విప్లవం వైపుగా అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. ప్రభుత్వ అవినీతి బయటకు రావద్దనే బ్యాన్ చేశారని విప్లవ కారులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వం ఈ చర్యను సమర్ధించుకుంటోంది. ప్రభుత్వ పాలసీల్లో భాగంగానే సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసినట్లు చెబుతున్నారు. గైడ్ లైన్స్ పాటించనందున పలు సైట్లను బ్యాన్ చేసినట్లు ప్రధాన మంత్రి శర్మ ఓలి తెలిపారు. దేశాన్ని తగ్గించాలని చూస్తే ఎలాంటి మాద్యమాలనైనా బ్యాన్ చేస్తామని ఆయన తెలిపారు.