Theatre Releases: ఆడియన్స్ను థియేటర్స్కి రప్పించే కథలతో.. డిఫరెంట్ జోనర్లలో మూడు సినిమాలు

Theatre Releases: ఆడియన్స్ను థియేటర్స్కి రప్పించే కథలతో.. డిఫరెంట్ జోనర్లలో మూడు సినిమాలు

ప్రతివారం లానే ఈ వారం (సెప్టెంబర్ 12) కూడా కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. డిఫెరెంట్ జోనర్స్లో థియేటర్/ఓటీటీల్లో సినిమాలు అలరించనున్నాయి. క్రైమ్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ, మైథలాజికల్ అడ్వెంచర్, లవ్ స్టోరీ, యాక్షన్ డ్రామా వంటి వివిధ రకాల కాన్సెప్ట్స్తో రానున్నాయి. మరి ఆ సీనిమాలేంటీ? వాటి నేపథ్యం ఏంటనేది ఓ లుక్కేద్దాం. 

‘కిష్కింధపురి’ (Kishkindhapuri):

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మూవీ ‘కిష్కింధపురి’. హారర్ మిస్టరీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌తో తెరకెక్కింది. ఈ మూవీని చావు కబురు చల్లగా మూవీతో దర్శకుడిగా పరిచయమైన కౌశిక్ డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 12న థియేటర్స్లో రిలీజ్ కానుంది.

ALSO READ : భీమ్స్ మాస్ బీట్‌కు చిరు-నయన్ స్టెప్పులు..

ఇప్పటికీ రిలీజైన టీజర్, ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ విజువల్స్ వణుకుపుట్టించేలా ఉన్నాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌తో బెల్లకొండ, అనుపమ స్ట్రాంగ్ హిట్ కొట్టేలా స్క్రిప్ట్ను సెలెక్ట్ చేసున్నారు. ఇప్పటికే ఈ జంట ‘రాక్షసుడు’ వంటి క్రైమ్ థ్రిల్లర్లో నటించి మంచి హిట్ అందుకున్నారు. ఈ ‘కిష్కింధపురి’ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సాహు గారపాటి నిర్మించారు.

మిరాయ్ (Mirai):

తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘మిరాయ్’. ఇందులో తేజ సూపర్ యోధ అవతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, మంచు మనోజ్ సైంటిఫికల్ విలన్ రోల్లో కనిపించబోతున్నారు. ఇందులో వీరిద్దరూ ఒకరినొకరు ఢీ అంటే ఢీ అనేలా విధ్వంసం సృష్టించారు.

ఇప్పటికే ఆ విజువల్స్ టీజర్, ట్రైలర్ లో కనిపించాయి. అయితే, ఈ సినిమా ఇతిహాసాలు, పురాణాలూ మిళితం చేస్తూ యాక్షన్ అడ్వెంచర్గా వస్తుండటం విశేషం. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ గ్రాండ్గా నిర్మించారు. సెప్టెంబర్ 12న 2డి, 3డి ఫార్మాట్స్‌‌లో ఎనిమిది భాషల్లో సినిమా విడుదల కానుంది.

టన్నెల్‌ (Tunnel):

అథర్వ మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘టన్నెల్‌’. క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కింది. రవీంద్ర మాధవన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో అశ్విన్‌ కాకుమాను విలన్ రోల్ లో నటించాడు. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 12న) థియేటర్లలోకి రానుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉండనుంది.

ఇటీవలే టన్నెల్‌ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.  ఇందులో ‘ఈ యూనిఫామ్‌ వేసుకున్న ప్రతిఒక్కడికి అందరూ ఫ్యామిలీనే రా..’ అంటూ అథర్వ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో పాటు లవ్‌ ట్రాక్‌ ఆసక్తి కలించేలా ఉండనున్నాయి. ఈ మూవీని తెలుగులో ఎ.రాజు నాయక్‌ రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే అథర్వ మురళీ ఇటీవలే DNA (తెలుగులో మై బేబి) మూవీతో వచ్చి తెలుగు ఆడియన్స్కి మంచి థ్రిల్ ఇచ్చాడు. 

ఇక ఈ థియేటర్ సినిమాలతో పాటుగా రజినీకాంత్ కూలీ (ప్రైమ్ సెప్టెంబర్ 11), సైయారా నెట్ఫ్లిక్స్ (సెప్టెంబరు 12)న రానున్నాయి. వీటితో పాటుగా 'రాబో ఇన్‌ లవ్‌' (తెలుగు సిరీస్‌) సెప్టెంబరు 12న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కి రానుంది.