ChiruAnil: భీమ్స్ మాస్ బీట్‌కు చిరు-నయన్ స్టెప్పులు.. కొరియోగ్రఫీ చేసే హుషారైన మాస్టర్ ఇతనే!

ChiruAnil: భీమ్స్ మాస్ బీట్‌కు చిరు-నయన్ స్టెప్పులు.. కొరియోగ్రఫీ చేసే హుషారైన మాస్టర్ ఇతనే!

చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం  ‘మన శంకరవరప్రసాద్ గారు’. పండక్కి వస్తున్నారు అనేది ట్యాగ్‌‌‌‌లైన్‌‌‌‌. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

రీసెంట్‌‌‌‌గా కొత్త షెడ్యూల్‌‌‌‌ను స్టార్ట్ చేయగా, ఇందులో భాగంగా సోమవారం (Sept8) నుంచి సాంగ్‌‌‌‌ షూట్ జరగనుంది. దీనికోసం నయనతార ఆదివారమే హైదరాబాద్‌‌‌‌కు చేరుకుంది. హైదరాబాద్‌‌‌‌లో వేసిన స్పెషల్ సెట్‌‌‌‌లో ఈ సాంగ్ షూట్ జరగనుంది.

చిరంజీవి, నయనతారలపై చిత్రీకరించనున్న ఈ పాటకు మాస్ బీట్‌‌‌‌ను కంపోజ్ చేశారట భీమ్స్ సిసిరోలియో. విజయ్ పొలాకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఈ మాస్టర్ జానపద స్టెప్పులతో బాగా పాపులర్. గతంలో విజయ్ పోలాకి కొరియోగ్రఫీ చేసిన పాటలు ఆడియన్స్తో స్టెప్పులేయించాయి.

ALSO READ : దేశవ్యాప్త ప్రమోషన్ టూర్లతో ‘మిరాయ్’..

అందులో "నక్కిలేసు గొలుసు" (పలాస 1978), "పుష్ప పుష్ప", "గంగమ్మ తల్లి జాతర" సాంగ్ (పుష్ప 2: ది రూల్), రవితేజ మాస్ జాతర పాట, కోట బొమ్మాళి, డబుల్ ఇస్మార్ట్ వంటి హుషారైన గీతాలకు డ్యాన్స్ అందించాడు. ఈ సారి మెగాస్టార్ చిరుతో అవకాశం రావడంతో, ఎలాంటి బీట్స్ కంపోజ్ చేయనున్నాడనేది ఆసక్తిగా మారింది. 

ఇకపోతే ఈ మూవీని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌తో  సినిమాపై అంచనాలు పెరిగాయి.