MIRAI: దేశవ్యాప్త ప్రమోషన్ టూర్లతో ‘మిరాయ్’.. తేజ మైథలాజికల్ యాక్షన్పై భారీ అంచనాలు

MIRAI: దేశవ్యాప్త ప్రమోషన్ టూర్లతో ‘మిరాయ్’.. తేజ మైథలాజికల్ యాక్షన్పై భారీ అంచనాలు

తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన  చిత్రం ‘మిరాయ్’.  సెప్టెంబర్ 12న పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది. తాజాగా కర్నాటకలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

అతిథిగా హాజరైన ధృవ సర్జా మాట్లాడుతూ ‘ఇదొక పండగలాంటి సినిమా. చాలా అద్భుతమైన నటీనటులు టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేశారు. టీజర్, ట్రైలర్ బాగున్నాయి. తప్పకుండా ఈ సినిమాని కన్నడ ప్రేక్షకులందరూ చూసి గొప్పగా ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని టీమ్‌‌‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు.

తేజ సజ్జా మాట్లాడుతూ ‘యాక్షన్ ప్రిన్స్ ధ్రువ అన్న నాకు లక్కీ చార్మ్. ‘హనుమాన్‌‌‌‌’కు కూడా సపోర్ట్ చేశారు. ‘మిరాయ్’ యాక్షన్ అడ్వెంచర్స్, ఫాంటసీతో గ్రేట్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇచ్చే ఫిల్మ్.  పిల్లలు, పెద్దలు అందరూ కలిసి థియేటర్‌‌‌‌‌‌‌‌లో చూడదగ్గ చిత్రం’ అని అన్నాడు.  ఇది చాలా  లార్జ్ స్కేల్లో తీసిన సినిమా అని, ప్రేక్షకులకు విజువల్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇస్తుందని నిర్మాత టీజీ విశ్వ  ప్రసాద్ అన్నారు.

ALSO READ : ‘పుష్ప’ ఇంటర్నేషనల్.. మనం లోకల్‌‌‌‌’..

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితమే మిరాయ్ ఐడియా పుట్టింది. ఈ ఆలోచనకి ఇతిహాసాలని ఎలా ముడి పెట్టొచ్చనే ప్రాసెస్‌కి మాత్రం చాలా టైం పట్టింది. చిన్నప్పటి నుంచి పురాణ ఇతిహాసాలను గురించి విన్న కథలు, పాషనేటింగ్ ఎలిమెంట్స్‌తో మిరాయ్‌ని డెవలప్ చేయడం జరిగింది.

అయితే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఇతిహాసాల్లో పురాణాల్లో ఉందనే నమ్మకంతో చేసిన కథ ఇది. ఈ కథని యాక్షన్ అడ్వెంచర్‌గా ట్రీట్ చేశాం. ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్ అని కార్తీక్ తన మిరాయ్ విశేషాలు పంచుకున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్, బెంగుళూరు, వైజాగ్, ముంబై వంటి ప్రధాన నగరాల్లో వరుసం ప్రమోషన్లతో మిరాయ్ మేకర్స్ బిజీగా ఉన్నారు.