చంద్రగ్రహణం ఎఫెక్ట్: కాశీ, వైష్ణోదేవీ సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ క్లోజ్..!

చంద్రగ్రహణం ఎఫెక్ట్: కాశీ, వైష్ణోదేవీ సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ క్లోజ్..!

న్యూఢిల్లీ: 2025, సెప్టెంబర్ 7న అంటే ఆదివారం రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 82 నిమిషాల పాటు కొనసాగనున్న ఈ బ్లడ్ మూన్ ప్రభావంతో దాదాపు దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డాయి. ముఖ్యంగా ప్రముఖ ఆలయాలకు నిలయమైన ఉత్తరాదిలో కూడా టెంపుల్స్ దాదాపు అన్ని క్లోజ్ అయ్యాయి. 

వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయాన్నీ మూసేశారు అర్చకులు. జమ్మూ కాశ్మీర్ లో వైష్ణో దేవీ టెంపుల్ క్లోజ్ చేశారు. ఉత్తరాఖండ్‎లోని కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాలు, అయోధ్యలో రామాలయం, మథురలో శ్రీ కృష్ణుడు ఆలయం మూతపడింది. అలాగే తమిళనాడులోని బృహదీశ్వరాలయం, అరుణాచలం.. ఆంధ్రప్రదేశ్‎లోని తిరుమల వంటి ప్రముఖ టెంపుల్స్ చంద్ర గ్రహణ ప్రభావంతో మూతబడ్డాయి. 

ALSO READ : చంద్రగ్రహణం ఎఫెక్ట్: తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. తిరిగి తెరిచేది ఎప్పుడంటే...?

ఆదివారం (సెప్టెంబర్ 7) రాత్రి 8:58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సోమవారం (సెప్టెంబర్ 8)  తెల్లవారుజామున 2:25 గంటలకు చంద్రగ్రహణం వీడనుంది. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత సోమవారం (సెప్టెంబర్ 8) సంప్రోక్షణ అనంతరం తిరిగి దేశవ్యాప్తంగా దేవాలయాలు తెరుచుకోనున్నాయి.