
ఈ చంద్ర గ్రహణంలో మిథునం, సింహ, కుంభ, మీనం రాశుల వారికి చెడు ఫలితాలు ఎక్కువగా ఉండనున్నాయి. అందువల్ల.. మరీ ముఖ్యంగా సింహ, కుంభ రాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మేలు. పొరపాటున గ్రహణాన్ని ఈ రాశుల వారు చూస్తే.. వ్యాపార సమస్యలు, ఉద్యోగంలో చికాకులు తలెత్తే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. చంద్రగ్రహణం అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడుతుందంటే.. సూర్య చంద్రుల మధ్య భూమి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అలా పూర్తిగా భూమి నీడలోకి చంద్రుడు వచ్చినప్పుడు పూర్తిగా చీకటిగా మారిపోతాడు. ఈ ప్రక్రియను సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు
భూమి నీడ చంద్రుడి మీద కొంతభాగమే పడితే దానిని పాక్షిక చంద్ర గ్రహణం అని పిలుస్తారు. సంపూర్ణ చంద్ర గ్రహణాలు అరుదుగా సంభవిస్తాయని, పాక్షిక చంద్రగ్రహణాలు సంవత్సరానికి కనీసం రెండుసార్లు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హిందూ మతంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యతే ఉంది. గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. గ్రహణ సమయంలో నిద్ర పోవద్దని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రహణ సమయంలో ధ్యానం, జపం, తపం వంటి కార్యక్రమాలు చేయడం శ్రేయస్కరం.
ముఖ్యంగా గ్రహణం సమయంలో ఇంట్లో నిల్వ ఉండే ఆహార పదార్ధాలపై దర్భ లేదా గడ్డి (గరిక) వేసి ఉంచాలని వేద పండితులు సూచిస్తున్నారు. దర్భలు చాలా పవిత్రమైనవి. అందుకే వాటిని వివిధ కార్యాలలో వివిధ రకాలుగా వాడుతుంటారు. గ్రహణ సమయంలో సూర్యుడు లేదా చంద్రుడు నుంచి కాస్మొటిక్ రేడియేషన్ వస్తుంది. దాన్ని హరించే శక్తి దర్భలకు ఉంటుంది.
ALSO READ : చంద్రగ్రహణం ఎఫెక్ట్: తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. తిరిగి తెరిచేది ఎప్పుడంటే...?
అంతేకాకుండా గ్రహణం సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు మనిషి శరీరంపై శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపిస్తాయి. గ్రహణ సమయంలో శరీరంలోని శక్తి నశిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే తినే పదార్ధాలపై దర్భలను ఉంచితే రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు.