Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9లో గృహహింసకు గురైన నటి.. కన్నీటి కథతో ఎంట్రీ!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9లో గృహహింసకు గురైన నటి.. కన్నీటి కథతో ఎంట్రీ!

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' కు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  ఈ షో ప్రసారమవుతుందంటే చాలు ప్రేక్షకులు టీవీల ముందు కూర్చోండి పోతారు. 'బిగ్ బాస్' షో అంటే కేవలం వినోదం, డ్రామా,  టాస్కులు, ఎమోషన్స్, అనూహ్యమైన మలుపులే కాదు.. వివాదాలు ఉంటాయి. ఎప్పుడూ ఎదో ఒక వివాదంతో 'బిగ్ బాస్' షో వార్తల్లో ఉంటుంది. అందుకు 'బిగ్ బాబ్ తెలుగు9' మినహాయింపుల కాదు.  

'బిగ్ బాస్' షో కెమెరాలు ఆన్ కాకముందే డ్రామా, కాంట్రవర్సీ మొదలవ్వాలని నిర్వాహకులు కోరుకుంటారు. అందుకోసం వారు ఎప్పటినుంచో వివాదాలతో వార్తల్లో ఉన్న ప్రముఖులను ఎంపిక చేస్తారు.  గతంలో బిగ్ బాస్ సీజన్ 8లో శేఖర్ బాషా ఆడియో లీక్ కాంట్రవర్సీ, బిగ్ బాస్ సీజన్ 1లో ముమైత్ ఖాన్ డ్రగ్స్ కేసుతో నిందితురాలు అవ్వడం వంటి సంఘటనలను మనం చూశాం. ఇప్పుడు 'బిగ్ బాస్ తెలుగు 9' సీజన్‌లో  ఫ్లోరా సైనీ (ఆశా సైనీ). ఈ రియాలిటీ షోకు ఎంట్రీ రోజే తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న గృహ హింస గురించి ధైర్యంగా చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. 

'ఆశా సైనీ'గా ఆమె అడుగులు
తన నటన , గ్లామర్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న నటి  ఫ్లోరా సైనీ. 1999లో 'ప్రేమ కోసం' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దర్శక-నిర్మాతలు ఆమెను అడగకుండానే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆమె పేరును 'ఆశా సైనీ'గా మార్చేశారు. అప్పటి నుంచి ఆమె పేరు తెలుగు ప్రేక్షకులకు ఆశా సైనీగా గుర్తుండిపోయింది.  తొలి సినిమాతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోకపోయినా, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'చాలా బాగుంది' సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్‌డమ్ సాధించింది. ఆ తర్వాత 'ప్రేమతో రా', 'నరసింహ నాయుడు', 'నువ్వు నాకు నచ్చావ్' వంటి స్టార్ హీరోల సినిమాల్లో రెండో హీరోయిన్‌గా బాగా పేరు సంపాదించుకుంది. దాదాపు 150 సినిమాల్లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించిన ఫ్లోరా సైనీ, పలు రంగాల్లో తన పేరుని నిలబెట్టుకుంది.

►ALSO READ | 510 కిలోల డెడ్ లిఫ్ట్ తో అతని రికార్డ్ అతడే బద్దలుకొట్టాడు.. ఈ నటుడు ఎవరంటే.. ?

ప్రేమగా మొదలైన రిలేషన్ షిప్..  హింసగా మారిన తర్వాత...
కానీ, గ్లామరస్ అయిన ఆమె జీవితంలో వ్యక్తిగత బాధాకరమైన విషయాలు కూడా ఉన్నాయి. 20 ఏళ్ల వయసులోనే ఆమె హిందీ సినిమా నిర్మాత గౌరంగ్ దోషిని ప్రేమించింది. మొదట ఎంతో మధురంగా అనిపించిన ఈ బంధం..  క్రమంగా హింసగా మారింది. గౌరంగ్ దోషి తనను కుటుంబం నుండి దూరం చేశారని, తన ఫోన్‌ను లాక్కున్నారని, ఉద్యోగాన్ని మానేయమని ఒత్తిడి చేశారని ఫ్లోరా గతంలో ఓ ఇంటర్యూలో చెప్పింది. నిరంతరం శారీరకంగా హింసించేవాడని వెల్లడించింది.  ఒకానొక సందర్భంలో నాతో పాటు రండి లేకపోతే నిన్ను చంపేస్తాను అని  బెదిరించారు . ఈ సమయంలో తన తల్లి డబ్బు, దుస్తుల గురించి ఆలోచించకుండా పారిపో అని సలహా ఇచ్చింది. దీంతో ఆ పరిస్థితి నుంచి  ధైర్యంగా అక్కడ నుండి పారిపోయానని ఫ్లోరా తెలిపింది.

 

2007లో ఈ సంఘటనలు జరిగినప్పటికీ, ఫ్లోరా 2018లో వచ్చిన ‘మీ టూ’ ఉద్యమం సమయంలోనే తన అనుభవాలను బయటపెట్టారు. ‘స్త్రీ’ సినిమా విజయంతో ఆమెకి ఇంకా ఎక్కువ గుర్తింపు లభించింది. దాంతో ఆమె తన జీవితంతో విషాదాన్ని బహిరంగంగా చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు, బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌లోకి అడుగుపెట్టడం ద్వారా, ఫ్లోరా సైనీ కేవలం ఒక కంటెస్టెంట్ మాత్రమే కాదు, తన జీవితంలో ఎదుర్కొన్న పోరాటం, మనుగడ కోసం చేసిన  యుద్ధం ఎందరికో ఆదర్శంగా నిలుపుతున్న ఒక స్ఫూర్తిదాయకమైన గొంతుకగా మారారు. ఆమె కథనం బిగ్ బాస్ వేదిక ద్వారా మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంది. మరి బిగ్ బాస్ లో తన టాలెంట్ ఏ మాత్రం చూపిస్తోందో చూడాలి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Flora Saini (@florasaini)