సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో ఓ రైతు సాగు చేసిన పొద్దుతిరుగుడు పంట ఆ రోడ్డు గుండా వెళ్లే వారిని ఆకట్టుకుంటుంది. కనుచూపుమేరంతా నేలకు ఆకుపచ్చ, పసుపు రంగేసినట్లు అందంగా కనిపిస్తుండడంతో అటు వైపు వెళ్తున్న వాహనదారులు చేను వద్ద ఆగి సెల్ఫీలు తీసుకుంటున్నారు.
– వెలుగు ఫోటోగ్రాఫర్, సిద్దిపేట
