భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన మాట నిలబెట్టుకున్నాడు. టీమిండియా మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ కు బ్యాట్ ఆకారంలో ఉన్న స్పెషల్ గిటార్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందు జెమీమాకు గవాస్కర్ గిటార్ ను గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. గిటార్ ను చూసిన వెంటనే ఈ టీమిండియా మహిళా క్రికెటర్ ఆనందం పట్టలేకపోయింది. గవాస్కర్ కు కృతజ్ఞతలు చెబుతూ తన సంతోషాన్ని పంచుకుంది. గవాస్కర్ ఇచ్చిన గిఫ్ట్ ను తీసుకొని ఈ దిగ్గజ క్రికెటర్ తో కొన్ని ఫోటోలు దిగింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఈ వీడియో క్లిప్‌లో కిషోర్ కుమార్, మన్నా డే పాడిన 'యే దోస్తీ' పాటను వీరిద్దరూ సరదాగా పాడారు. "సునీల్ సర్ తన ప్రామిస్ ను నిలబెట్టుకున్నారు. ఈ గిఫ్ట్ చాలా సంతోషంగా అనిపించింది. ఇది నాకు చాలా స్పెషల్". అని జెమిమా రోడ్రిగ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం జెమీమా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రోడ్రిగ్స్‌ను తొలిసారి కెప్టెన్‌గా నియమించారు. ఈ మెగా లీగ్ లో ఢిల్లీ వరుసగా మూడు ఫైనల్స్ లో ఓడిపోయిన తర్వాత జెమీమా కెప్టెన్సీలో ఛాంపియన్ గా నిలుస్తారనే ఆశాభావంతో కనిపిస్తోంది.
Also Read : ప్రమాదంలో సచిన్, సంగక్కర, పాంటింగ్ హిస్టారికల్ రికార్డ్స్
2025 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి సగర్వంగా భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఫైనల్‌కు వెళ్లిందంటే కారణం జెమీమా రోడ్రిగ్సే. ఫైనల్ ము ముందు ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ ఇండియా గెలిస్తే.. జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి ఒక పాట పాడుతానని గవాస్కర్ చెప్పారు. ఆమె గిటార్ వాయిస్తుంటే తాను పాట పాడుతానని అన్నారు. జెమీమాకు ఇష్టం ఉంటనే ఈ పని చేస్తానన్నారు. గతంలో ఓసారి బీసీసీఐ అవార్డుల కార్యక్రమం సందర్భంగా తాము ఇలా చేశామని గవాస్కర్ గుర్తు చేశారు. జెమీమా గిటార్ వాయిస్తుంటే.. తాను పాడానని వివరించారు. టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే.. మరోసారి ఆ సీన్ రిపీట్ చేయాలనుకుంటున్నానని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
