నామినేషన్ దాఖలు చేసిన పట్నం సునీత మహేందర్ రెడ్డి

నామినేషన్ దాఖలు చేసిన పట్నం సునీత మహేందర్ రెడ్డి

మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా  పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తూముకుంట మున్సిపల్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను కలెక్టర్ గౌతమ్ కు అందజేశారు సునీత. ఆమెతో పాటు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వజ్రాష్ యాదవ్ ఉన్నారు. ఇవ్వాళ మేడ్చల్ లో జరగనున్న కాంగ్రెస్  బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.