
- బీఆర్ఎస్ పనికొచ్చే ప్రాజెక్టు ఒక్కటీ కట్టలేదు
న్యూఢిల్లీ, వెలుగు: సుంకిశాల ప్రాజెక్టు కర్త, కర్మ, క్రియ కేటీఆరే అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ప్రజలకు పనికొచ్చే ఒక్క ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ నిర్మించలేదని విమ ర్శించారు. మేడిగడ్డ కుంగడంలో కేసీఆర్, సుంకిశాల విషయంలో కేటీఆర్ బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
2021లో కేటీఆర్ సుంకిశాల దగ్గర ఫౌండేషన్ స్టోన్ వేశారని మల్లు రవి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలోనే టెండర్లు, పనులు, నిర్మాణ వ్యయం పెంపు వంటి అంశాలు అన్నీ జరిగాయని చెప్పారు. 2021 లో పనులు మొదలుపెట్టి, 2023 వరకు పూర్తి చేశారని.. ప్రస్తుతం కొంత పెండింగ్ లో ఉందన్నారు.