Police Vari Heccharika: సమాజంపై బాధ్యతతో.. జులై 18న పోలీస్ వారి హెచ్చరిక..

Police Vari Heccharika: సమాజంపై బాధ్యతతో.. జులై 18న పోలీస్ వారి హెచ్చరిక..

సన్నీ అఖిల్ హీరోగా బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మించిన చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. జులై 18న సినిమా రిలీజ్.  తాజాగా ఈ మూవీ ఫస్ట్ టికెట్‌‌ను మట్టికవి బెల్లి యాదవ్ లాంచ్‌‌ చేసి బెస్ట్ విషెస్‌ చెప్పారు.

అనంతరం నిర్వహించిన ఈవెంట్‌‌లో దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ ‘ఈ సినిమా కాస్త భిన్నంగా ఉంటుంది.  నెగెటివ్ క్యారెక్టర్ల మధ్య ప్రేమ, పాటలు ఉండబోతున్నాయి.టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్లింది. ఈ చిత్రంతో మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నాం. సమాజంపై  ప్రేమతో, బాధ్యతతో థియేటర్ నుండి ప్రేక్షకులు బయటకు వెళ్తారు’ అని చెప్పారు.

సన్నీ మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుండి సినిమాలపైన ఉన్న ఆసక్తితో ఇందులో  మంచి పాత్రను పోషించాను’అని అన్నాడు. ఈ చిత్రంలో తన పాత్ర కీలకంగా ఉంటుందని నటి జయ వాహిని చెప్పింది. సపోర్ట్ చేసిన అందరికీ నిర్మాత బెల్లి జనార్ధన్ థ్యాంక్స్ చెప్పారు.