
రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఎక్కువగా నమోదయ్యా యి. నిజామాబాద్ లో అత్యధికంగా 37.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయ్యింది. మెదక్,ఆదిలాబాద్‌లో 36.8, మహబూబ్ నగర్ లో 35.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల మేర పెరిగాయి. భద్రాచలం 25,రామగుండం, మహబూబ్ నగర్ , నిజామాబాద్ లో 24 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయని,రానున్న మూడురోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి చెప్పారు.