సన్నిలియోన్ వస్తే మేం కంట్రోల్ చేయలేం.. పర్మీషన్ ఇవ్వని పోలీసులు

సన్నిలియోన్ వస్తే మేం కంట్రోల్ చేయలేం.. పర్మీషన్ ఇవ్వని పోలీసులు

కేరళ రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో కల్చరల్ ప్రొగ్రామ్ కు యాక్టర్ సన్నీలియోన్ వస్తున్నారని తెలిసి.. ఈమెంట్ క్యాన్సల్ చేశారు. తిరువనంతరపురం యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్ లో జూలై 5న ఓ ప్రొగ్రామ్ జరగనుంది. ఆ కార్యక్రమానికి యాక్టర్ సన్నీలియోన్ హాజరు అవ్వాల్సి ఉంది. వైస్ ఛాన్సలర్, పోలీసులు ఆ యూనివర్సిటీ కల్చరల్ ప్రొగ్రామ్ కు పర్మిషన్ క్యాన్సల్ చేశారు. 

బయట నుంచి సెలబ్రెటీలు వస్తే క్రౌడ్ ను కంట్రోల్ చేయలేమని పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కూల్ ఇంజనీరింగ్ లో సింగర్ నిఖితా గాంధీ వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు చనిపోయారని, 50 మంది దాకా గాయాలపాలైయ్యారని పోలీసులు గుర్తు చేశారు.