సన్ రైజర్స్‌‌‌‌ గ్రాండ్ విక్టరీ ..ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో థర్డ్ హైయెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరు చేసిన సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సన్ రైజర్స్‌‌‌‌ గ్రాండ్ విక్టరీ  ..ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో థర్డ్ హైయెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరు చేసిన సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 

  • 286తో మొదలు ..278తో ముగింపు
  • క్లాసెన్‌‌‌‌ ఖతర్నాక్ సెంచరీ
  • 110 రన్స్‌‌‌‌తో కేకేఆర్‌‌‌‌‌‌‌‌పై  గ్రాండ్ విక్టరీ 
  • ఆరో  విజయంతో  సీజన్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌ 18లో ప్లే ఆఫ్స్ చేరడంలో ఫెయిలైన సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ హిట్టింగ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో ఫ్యాన్స్‌‌‌‌ను అలరించడంలో మాత్రం సక్సెస్ అయింది.  తమ తొలి మ్యాచ్‌‌‌‌లోనే సెకండ్ హయ్యెస్ట్ స్కోరు (286/6)తో దుమ్మురేసిన కమిన్స్ సేన ఆఖరాటలో మూడో అత్యధిక (278/3) స్కోరు కొట్టి ఈ సీజన్‌‌‌‌కు సూపర్ ఫినిషింగ్ ఇచ్చింది. గత సీజన్ రన్నరప్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ ఆరో విజయంతో ఈ ఏడాదికి ముగింపు పలికింది. హెన్రిచ్ క్లాసెన్ (39 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 105 నాటౌట్‌‌‌‌) ఖతర్నాక్ సెంచరీతో విజృంభించడంతో ఆదివారం రాత్రి జరిగిన  మ్యాచ్‌‌‌‌లో  110 రన్స్ తేడాతో  డిఫెండింగ్ చాంపియన్ కోల్‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌ను చిత్తు చేసింది. గత సీజన్ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. తొలుత సన్ రైజర్స్‌‌‌‌ 20 ఓవర్లలో 278/3 స్కోరు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (40 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 76) సత్తా చాటాడు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో కోల్‌‌‌‌కతా 18.4 ఓవర్లలో 168 రన్స్‌‌‌‌కే ఆలౌటై ఓడింది. ఎనిమిదో ప్లేస్‌‌‌‌తో లీగ్‌‌‌‌ను ముగించింది. మనీష్ పాండే (23 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37), హర్షిత్ రాణా (21 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34) టాప్ స్కోరర్లు‌‌‌‌. రైజర్స్ బౌలర్లలో హర్ష్‌‌‌‌ దూబే,  ఉనాద్కట్‌‌‌‌ చెరో మూడు, ఎషాన్ మలింగ రెండు వికెట్లు తీశారు.  క్లాసెన్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

క్లాసెన్, హెడ్ కమాల్‌‌‌‌

తొలుత ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌.. తర్వాత హెన్రిచ్ క్లాసెన్‌‌‌‌ పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుపడటంతో సన్ రైజర్స్ భారీ స్కోరు చేసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన రైజర్స్ తొలి ఓవర్లో రెండే రన్స్ చేసినా.. రెండో ఓవర్‌‌‌‌‌‌‌‌ నుంచి హిట్టింగ్ మొదలు పెట్టింది. అన్రిచ్ బౌలింగ్‌‌‌‌లో హెడ్ సిక్సర్ల ఖాతా తెరవగా.. అభిషేక్ (32) రెండు బౌండ్రీలు రాబట్టాడు. వైభవ్ అరోరా వేసిన మూడో ఓవర్లో 6, 4, 6తో టాప్ గేర్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన హెడ్‌‌‌‌.. హర్షిత్ రాణాకు మూడు ఫోర్లతో స్వాగతం పలికాడు. ఓపెనర్ల జోరుతో పవర్ ప్లేలోనే 79 రన్స్ వచ్చాయి. ఫీల్డింగ్ మారిన తర్వాత నరైన్ బౌలింగ్‌‌‌‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన అభి.. మరో షాట్‌‌‌‌కు ట్రై చేసి రింకూకు చిక్కడంతో తొలి వికెట్‌‌‌‌కు 92 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న హెడ్‌‌‌‌కు క్లాసెన్ తోడవ్వడంతో కేకేఆర్ కష్టాలు రెట్టింపయ్యాయి.  వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌‌‌‌లో సిక్స్‌‌‌‌తో హెడ్‌‌‌‌ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. క్లాసెన్ సిక్స్‌‌‌‌తో టచ్‌‌‌‌లోకి వచ్చాడు. వరుణ్‌‌‌‌ను టార్గెట్‌‌‌‌ చేసిన హెడ్ మరో సిక్స్ కొడితే.. క్లాసెన్ మూడు ఫోర్లు బాదడంతో సగం ఓవర్లకే రైజర్స్ 139/1 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్లో బౌలింగ్‌‌‌‌కు వచ్చిన రస్సెల్‌‌‌‌కు ఈ ఇద్దరు రెండు ఫోర్లు, సిక్స్‌‌‌‌తో వెల్‌‌‌‌కం చెప్పారు. రాణా బౌలింగ్‌‌‌‌లో 4, 6, 6తో రెచ్చిపోయిన క్లానెస్‌‌‌‌17 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ అందుకున్నాడు. ఇద్దరి జోరు చూస్తుంటే రైజర్స్ 300 మార్కు అందుకునేలా కనిపించింది. కానీ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న హెడ్‌‌‌‌ను 13వ ఓవర్లో ఔట్‌‌‌‌ చేసిన నరైన్‌‌‌‌ ఒకే రన్ ఇవ్వడంతో కేకేఆర్ కాస్త పుంజుకునేలా కనిపించింది. కానీ, ఇషాన్ కిషన్‌‌‌‌ (29)తోడుగా  క్లాసెన్ ఆ చాన్స్ ఇవ్వలేదు. నరైన్ బౌలింగ్‌‌‌‌లోనే రెండు భారీ సిక్సర్లు కొట్టి 15 ఓవర్లకే స్కోరు 200 దాటించాడు. ఇంకో ఎండ్‌‌‌‌లో ఇషాన్ కూడా బ్యాట్‌‌‌‌కు పని చెప్పడంతో 18 ఓవర్లకు స్కోరు 250 దాటింది. వైభవ్ వేసిన 19వ ఓవర్లో ఇషాన్ ఔటవగా.. లాస్ట్ బాల్‌‌‌‌కు డబుల్‌‌‌‌తో క్లాసెన్‌‌‌‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అన్రిచ్ వేసిన చివరి ఓవర్లో అనికేత్ వర్మ (12 నాటౌట్‌‌‌‌) 4,6.. క్లాసెన్‌‌‌‌ ఫోర్ సహా 17 రన్స్ రాబట్టి స్కోరు 270 దాటించారు. 

కేకేఆర్ ఢమాల్

భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో  కేకేఆర్ ఏ దశలోనూ సన్ రైజర్స్‌‌‌‌కు పోటీ ఇవ్వలేదు.  క్రమం తప్పకుండా వికెట్లు తీసిన హైదరాబాద్ బౌలర్లు ఆ టీమ్ నడ్డి విరిచారు. ఓపెనర్ సునీల్ నరైన్ (31) తొలి ఓవర్లోనే రెండు సిక్సర్లు కొట్టి కాసేపు మెరుపులు మెరిపించాడు. నాలుగో ఓవర్లో స్లో ఆఫ్​ కట్టర్‌‌‌‌‌‌‌‌తో ఉనాద్కట్ అతడిని బౌల్డ్ చేయడంతో కేకేఆర్ పతనం మొదలైంది. తన తర్వాతి ఓవర్లోనే అజింక్యా రహానె (15)ను కూడా ఉనాద్కట్ పెవిలియన్ చేర్చగా.. క్రీజులో ఇబ్బంది పడిన డికాక్‌‌‌‌ (9)ను ఎషాన్ మలింగ ఔట్ చేశాడు. ఎనిమిదో ఓవర్లో హర్ష్ దూబే వరుస బాల్స్‌‌‌‌లో రింకూ సింగ్ (9), ఆండ్రీ రస్సెల్‌‌‌‌ (0)ను వెనక్కిపంపడంతో 70/5తో కేకేఆర్ ఓటమి ఖాయమైంది. సింగిల్స్‌‌‌‌కే ఇబ్బందిపడ్డ రఘువంశీ (14) ఆరో వికెట్‌‌‌‌గా ఔటవగా.. రమణ్​దీప్‌‌‌‌ (13)ను హర్ష్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేశాడు.  ఈ దశలో మనీష్  పాండే, హర్షిత్ రాణా పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.  

సంక్షిప్త స్కోర్లు

హైదరాబాద్‌‌‌‌: 20 ఓవర్లలో 278/3 (క్లాసెన్ 105 నాటౌట్‌‌‌‌, హెడ్ 76, నరైన్ 2/42)
కోల్​కతా:  18.4 ఓవర్లలో 168 ఆలౌట్‌‌‌‌ ( మనీష్ 37, ఉనాద్కట్ 3/24, మలింగ 3/31,  హర్ష్‌‌‌‌ దూబే 3/34)

3 ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది థర్డ్ హయ్యెస్ట్ స్కోరు. టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–5 స్కోర్లలో తొలి నాలుగు సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే కావడం విశేషం. 

37 క్లాసెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీకి అవసరమైన బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. సన్ రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్, లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాయింట్ థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాస్టెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ ఇది.

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–5 స్కోర్లు

హైదరాబాద్ 287/3 (2024లో ఆర్సీబీపై)  
హైదరాబాద్ 286/6 (2025లో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై) 
హైదరాబాద్ 278/3 (2025లో కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాపై)
హైదరాబాద్ 277/3 (2024లో ముంబైపై)
కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా - 272/7 (2024లో ఢిల్లీపై)